కొత్త సరకు ఓడ ఒమన్-కృష్ణపట్నం మధ్య...
- April 13, 2016
ఆంధ్రప్రదేశ్ (నెల్లూరు జిల్లా) లోని కృష్ణపట్నం పోర్టు నుంచి ఒమన్లోని సలాలాహ్ వరకూ కొత్త సరకు రవాణా సర్వీసు ప్రారంభం కానుంది. ఈ నెల 17 నుంచి ప్రతివారం ఒక సర్వీసును మీయర్స్క్ లైన్ ఇండియా ప్రారంభించనుందని కృష్ణపట్నం పోర్ట్ కంపెనీ ఒక ప్రకటనలో తెలియజేసింది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు, తూర్పు కర్ణాటక ప్రాంతాల్లోని వినియోగదార్లకు నేరుగా ఒమన్, దాని చుట్టుపక్కల ప్రాంతాలకు సరకు రవాణా చేసేందుకు వీలుకలుగుతుందని పేర్కొంది. భారత తూర్పు తీరం నుంచి అతి తక్కువ సమయంలో శ్రీలంక, ఒమన్ చేరుకునే అవకాశం కూడా ఉంటుందని వివరించింది. సలాలాహ్ నుంచి బయలుదేరే ఈ షిప్పింగ్ సర్వీసు కొలంబో మీదుగా కృష్ణపట్నం పోర్టు చేరుకుంటుంది. అక్కడి నుంచి కట్టుపల్లి మీదగా సలాలాహ్ వెళ్తుంది.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







