వైసీపీ కార్యాలయంలో అంబేడ్కర్‌ జయంతి వేడుకలు ..

- April 13, 2016 , by Maagulf
వైసీపీ కార్యాలయంలో అంబేడ్కర్‌ జయంతి వేడుకలు ..

డా.బిఆర్‌ అంబేడ్కర్‌ స్ఫూర్తిని కొనసాగించాలని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని వైసీపీ కార్యాలయంలో అంబేడ్కర్‌ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, వైసీపీ నేతలు అంబేడ్కర్‌ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్‌... అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం అంబేడ్కర్‌ పాటుపడ్డారని కొనియాడారు. అంబేడ్కర్‌ సూచనలను పాలకులు పాటించాలన్నారు. జనాభా ప్రాతిపదికన ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌కు నిధులు కేటాయించాలన్నారు. క్రిస్టియన్‌లో చేరిన ఎస్సీలకు కులసర్టిఫికెట్‌ ఇవ్వడం లేదని, ఎస్సీ,ఎస్టీల హక్కులను ఏపీ ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు. ట్రైబల్‌ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేయకుండా కాలయాపన చేస్తోందని దుయ్యబట్టారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com