ఈ నెల 18న టీటీడీ వాచీల ఈ-వేలం
- August 03, 2022
తిరుమల: టీటీడీ సంస్థ ఈ నెల 18న వాచీల ఈ-వేలం నిర్వహించనుంది.తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు, ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీలను ఈ-వేలంలో అందుబాటులో ఉంచుతారు. రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా 18న ఈ-వేలం నిర్వహించనున్నామని, భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని టీటీడీ ప్రజా సంబంధాల అధికారి తెలిపారు.
ఇందులో సీకో, హెచ్ఎమ్‌టీ, టైటాన్, సోని, క్యాషియో, టైమెక్స్, ఆల్విన్, సొనాటా, టైమ్‌వెల్, ఫాస్ట్‌ట్రాక్, సిటిజన్, రొలెక్స్‌తోపాటు ఇతర కంపెనీల వాచీలను వేలంలో అందుబాటులో ఉంచుతారు. కొత్తవి, ఉపయోగించినవి, పాక్షికంగా పాడైన వాచీలు.. ఇలా వివిధ కేటగిరీలుగా, మొత్తం 22 లాట్ల వాచీలు ఈ-వేలంలో ఉంటాయి. ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429 నెంబరులో, కార్యాలయం వేళల్లో సంప్రదించవచ్చు. అలాగే టీటీడీ వెబ్‌సైట్ http://www.tirumala.org లేదా రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ http://www.konugolu.ap.gov.inను సంప్రదించగలరు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







