భారత్‌లో తొమ్మిదో మంకీపాక్స్ కేసు నమోదు
- August 03, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో బుధవారం మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. ఢిల్లీలో ఉంటున్న నైజీరియాకు చెందిన 31 ఏళ్ల మహిళకు మంకీపాక్స్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. ఇది ఢిల్లీలోని నాలుగో కేసు కాగా.. దేశంలో తొమ్మిదో మంకీపాక్స్ కేసు. దేశంలో ఒక మహిళకు మంకీపాక్స్ సోకడం ఇదే మొదటిసారి.
ఆమెకు జ్వరం, చర్మంపై దద్దుర్లు, మెడ గ్రంథుల వద్ద వాపు వంటి లక్షణాలు కనిపించాయి. దీంతో స్థానిక ఎల్ఎన్జేపీ ఆస్పత్రిలో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు మంకీపాక్స్ సోకినట్లు తెలిపారు. అయితే, ఆమె ఎక్కడెక్కడ పర్యటించిందో ఇంకా సమాచారం లేదు. మరోవైపు దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటం, మంకీపాక్స్ లక్షణాలతో ఇటీవల ఒక రోగి మరణించడంతో కేంద్రం అప్రమత్తమైంది. మంకీపాక్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతూ కొన్ని సూచనలు చేసింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచనల ప్రకారం.. వైరస్ సోకిన వ్యక్తులకు దూరంగా ఉండాలి. రోగి తాకిన ప్రదేశాలను, వస్తువులను తాకకూడదు.
రోగికి దగ్గరగా ఉండే వాళ్లు శానిటైజర్, హ్యాండ్ వాష్, గ్లోవ్స్, మాస్క్ వంటివి వాడాలి. రోగి ఉపయోగించిన లాండ్రీ, బెడ్‌షీట్స్, టవల్స్ వంటివి వాడకూడదు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే పబ్లిక్ ప్లేసులకు వెళ్లకూడదు. ఈ వ్యాధి గురించి జరిగే అసత్య ప్రచారం విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







