తెలంగాణ లో భారీగా నమోదవుతున్న కరోనా కేసులు
- August 04, 2022
హైదరాబాద్: ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేస్తోన్న కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగతూ వస్తోంది. దీంతో పాటు మంకీపాక్స్ రూపంలో మరో వైరస్ ప్రజలకు విరుచుకుపడేందుకు సిద్ధమవుతోంది.
అయితే.. తాజాగా.. తెలంగాణలో కరోనా వ్యాప్తి పెరుగుతూ, తగ్గుతూ సాగుతోంది. బుధవారం రాష్ట్రంలో కొత్త కేసుల సంఖ్య 992గా నమోదైంది. గడచిన 24 గంటల్లో 41, 182 కరోనా పరీక్షలు నిర్వహించగా 992 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
అత్యధికంగా హైదరాబాదులో 376 కొత్త కేసులు వెల్లడి కాగా, రంగారెడ్డి జిల్లాలో 65, కరీంనగర్ జిల్లాలో 57, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 54, నల్గొండ జిల్లాలో 37 కేసులు గుర్తించారు. ఇంకా 842 మందికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. అదే సమయంలో 852 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 8,22,663 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 8,12,420 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 6,132 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







