నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి ముగ్గురి మరణానికి కారణమైన విదేశీయుడు

- April 14, 2016 , by Maagulf
నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి ముగ్గురి మరణానికి కారణమైన విదేశీయుడు

దోహా నేర న్యాయస్థానం నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ముగ్గురి మరణానికి మరో ముగ్గురు తీవ్రంగా గాయాల పాలవడానికి  కారణమయ్యడనే ఆరోపణపై  ఒక ఆసియా వాహనదారుని విషయంలో సమీక్షించింది .స్థానిక అరబిక్ డైలీ  ఆర్రయహ్ బుధవారం తెలిపిన వివరాల ప్రకారం  వాహనదారుడు  తన మినీబస్సు డ్రైవింగ్ చేస్తున్నపుడు అవసరమైన జాగ్రత్తలు తీసుకోలేదని  ఆరోపణలు చేసింది. అయితే ,వాహనదారుడు  ఇందులో తన తప్పు ఏమీ లేదని ఖండించారు. తాను వాహనం నడుపుతూ ఒకచోట మలుపు తిప్పుతుండగా  ఆకస్మికంగా టైరు పగిలి పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నాడు.గాయపడిన వారి అంగవైకల్యానికి శాతం వైద్య సర్టిఫికెట్ అందచేయాలని మరియు మరణించిన బాధితుల న్యాయ వారసులు అవసరమైన పత్రాలు సమర్పించాల్సి విషయంలో జాప్యం కారణంగా  ఈ కేసు వాయిదా పడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com