బహ్రెయిన్ లో స్వచ్ఛంద మంకీపాక్స్ వ్యాక్సిన్.. రిజిస్ట్రేషన్ ప్రారంభం
- August 05, 2022
బహ్రెయిన్ : స్వచ్ఛందంగా ‘మంకీపాక్స్’ వ్యాక్సిన్ కోసం ముందస్తు రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పౌరులు, నివాసితులు వెబ్‌సైట్ (healthalert.gov.bh) ద్వారా లేదా 24/7 హాట్‌లైన్ 444కు కాల్ చేయడం ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపింది. మంకీపాక్స్ వ్యాప్తిని అరికట్టడానికి అవసరమైన వైద్య, రవాణా వనరులను పొందేందుకు వ్యాక్సిన్ సదుపాయం ప్రభుత్వ వ్యూహంలో భాగమని పేర్కొంది. ఫ్రంట్‌లైన్ హెల్త్ వర్కర్లు, ఎక్స్‌పోజర్ ప్రమాదం ఎక్కువగా ఉన్న వారితో సహా సెట్ హెల్త్ ప్రోటోకాల్‌ల ప్రకారం ప్రాధాన్యత ఉంటుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. WHO సిఫార్సులు, ప్రమాణాల ఆధారంగా పరీక్ష, ఐసోలేషన్, చికిత్సకు సంబంధించిన సంబంధిత ప్రోటోకాల్‌లను అమలు చేస్తున్నట్లు ఆరోగ్య మంత్రి డాక్టర్ జలీలా బింట్ సయ్యద్ జవాద్ తెలిపారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







