కాగితాన్ని కరెన్సీగా మారుస్తానన్న మోసగాడు అరెస్ట్
- August 05, 2022
బహ్రెయిన్: కాగితాలను కరెన్సీ నోట్లకు మారుస్తానని నటిస్తూ బాధితులను మోసం చేసిన ఆఫ్రికన్‌ను యాంటీ ఎకనామిక్ క్రైమ్స్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసినట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ యాంటీ కరప్షన్ అండ్ ఎకనామిక్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ ప్రకటించింది. విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు చేసి నిందితుడిని అరెస్టు చేసినట్లు పేర్కొంది. నకిలీ కరెన్సీ తయారీకి వినియోగించే పరికరాలు, పనిముట్లు, రసాయనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు అప్పగించేందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, మోసాలపై సమాచారం తెలిస్తే హాట్‌లైన్ 992కు తెలపాలని జనరల్ డైరెక్టరేట్ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







