వల్గర్ వీడియో తీసిన మహిళా డీజేకి జైలు శిక్ష

- August 06, 2022 , by Maagulf
వల్గర్ వీడియో తీసిన మహిళా డీజేకి జైలు శిక్ష

బహ్రెయిన్: బహ్రెయిన్‌లో బహిరంగంగా అసభ్యకరంగా ప్రవర్తించినందుకు అభియోగాలు మోపబడిన ఒక మహిళ డీజేకి జైలు శిక్ష పడింది. సోషల్ మీడియాను దుర్వినియోగం చేసినందుకు కోర్టు ఆమెను నిర్దోషిగా ప్రకటించింది. మహిళతో పాటు అభియోగాలు మోపిన రెండో నిందితుడు అరబ్ వ్యక్తిని కూడా కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అయితే, ఈ శిక్షపై అప్పీల్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. సదరు మహిళ తన అనైతిక చర్యలకు సంబంధించిన వీడియో క్లిప్‌ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడంతో అది వైరల్ అయింది. బహ్రెయిన్‌లో చిత్రీకరించబడిన ఈ వీడియో  ప్రజా నైతికతకు విరుద్ధంగా ఉందని, ప్రజా ప్రయోజనాల కోసం ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బహ్రెయిన్ వ్యక్తితో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు హోటల్స్‌లో డీజేగా పని చేసేందుకు బహ్రెయిన్‌కు వచ్చానని మహిళ పోలీసులకు తెలిపింది. క్లిప్‌ను షూట్ చేసి తన స్నాప్‌చాట్ ఖాతాలో అప్‌లోడ్ చేసినట్లు మహిళ అంగీకరించింది. వీడియోలో తాను ధరించిన దుస్తులను అరబ్ వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్లు పోలీసులకు తెలిపింది. అయితే, అతను ఆ ఆరోపణలను ఖండించాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com