దాడికి చైనా ప్రణాళిక రూపొందిస్తోంది: తైవాన్
- August 06, 2022అమెరికా చట్టసభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటించిందన్న అక్కసుతో చైనా తీవ్రస్థాయిలో సైనిక విన్యాసాలు చేపట్టడం తెలిసిందే. తైవాన్ చుట్టూ ఆరు ప్రాంతాల్లో నేవీ, ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు చేపట్టి ఆ చిన్న ద్వీపదేశాన్ని భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నించింది. దీనిపై తైవాన్ తాజాగా స్పందించింది.
చైనా చేపట్టింది సైనిక విన్యాసాలుగా తాము భావించడంలేదని, అవి తైవాన్ భూభాగంపై దాడికి సన్నాహాలుగా భావిస్తున్నామని తైవాన్ రక్షణ శాఖ పేర్కొంది. తైవాన్ జలసంధి ప్రాంతంలో అనేక చైనా విమానాలు, నౌకలను తాము గమనించామని, తైవాన్ ప్రధాన భూభాగంపై ఎలా దాడి జరపాలన్నదానిపై అవి ముందస్తు సన్నాహాలు చేశాయని నమ్ముతున్నామని వెల్లడించింది. చైనా విమానాలు, నౌకల్లో కొన్ని మధ్యస్థ రేఖను కూడా దాటాయని ఆరోపించింది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు