రాగల 24-48 గంటల్లో తెలంగాణ లో భారీ నుంచి అతిభారీ వర్షాలు
- August 06, 2022
హైదరాబాద్: రాగల 24-48 గంటల్లో తెలంగాణ లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గత నెల రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతూనే ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని ప్రాజెక్ట్ లు , చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఈ తరుణంలో మరో రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురవనున్నాయని.. ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించారు. ఆదివారం రోజున మెదక్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కొమురంభీం అసిఫాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల, కరీంనగర్, హన్మకొండ, జనగామ, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు , జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
మంచిర్యాల జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పలు ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని.. ఆ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొన్ని గ్రామాల్లోనూ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సోమవారం నాడు నిర్మల్, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కొమురంభీం అసిఫాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల, కరీంనగర్, ములుగు , జయశంకర్ భూపాలపల్లి, జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం







