పూరీ మార్క్ రొమాన్స్ మరో సారి ప్రూవ్ అయ్యిందిగా.!
- August 06, 2022
పూరీ జగన్నాధ్ సినిమాలంటే, రగ్గ్డ్ లుక్స్‌లో హీరో, గ్లామరస్ లుక్స్ హీరోయిన్.. ఆటిట్యూడ్ కూడా చూపించాలనుకోండి. ఇవీ పూరీ మార్కు హీరో, హీరోయిన్ లెక్కలు.
తాజాగా పూరీ జగన్నాధ్ తెరకెక్కించిన ‘లైగర్’ మూవీ రిలీజ్‌కి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఆగస్ట్ 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ముంబయ్ మాఫియా బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా రూపొందింది.
విజయ్ దేవరకొండ ఈ సినిమాలో చాయ్ వాలాగా కనిపించబోతున్నాడు. అలాగే, బాక్సింగ్ నేపథ్యాన్నీ ఈ సినిమాలో కీలకంగా చూపించబోతున్నాడు. బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్యా పాండే హీరోయిన్గా నటిస్తుండగా, రమ్యకృష్ణ ఇంపార్టెంట్ రోల్ రోషిస్తోంది.
రిలీజ్‌కి నెల రోజులు ముందే సినిమా ప్రమోషన్లు షురూ చేశారు. విజయ్ నటిస్తున్న తొలి ప్యాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమాని భారీగా ప్రమోట్ చేస్తున్నారు. అందులో భాగంగానే మొన్న రిలీజైన ‘అకిడి.. పకిడి..’ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది.
తాజాగా ఇంకో రొమాంటిక్ సాంగ్ వీడియో వదిలారు. ఈ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. పూరీ మార్కు రొమాన్స్ అంతా ఈ పాటలో కనిపిస్తూనే, హీరో, హీరోయిన్లు వేసే డాన్సింగ్ స్టెప్పులు సింప్లీ సూపర్బ్ అనిపిస్తున్నాయ్. మణిశర్మ మ్యూజిక్ అందించిన ఈ సినిమాని, కరణ్ జోహార్‌తో కలిసి, పూరీ ఛార్మిలు నిర్మించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







