ప్రేమ విషయంలో చైతూ ఇలా.. సామ్ అలా.!
- August 06, 2022చై, సామ్ విడాకులకు సంబంధించి ఎన్ని వార్తలు వచ్చినా, అది మీడియాకి మంచి స్టఫ్ అవుతుంది. ఆడియన్స్ కూడా ఆ స్టఫ్ పట్ల కూసింత ఆసక్తి ఎక్కువగానే చూపిస్తుంటారు.
చైతూ ప్రస్తుతం ‘లాల్ సింగ్ చద్ధా’ సినిమా ప్రమోషన్లలో బిజీగా వున్నారు. ఈ ప్రమోషన్లకు సంబంధించి పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నాడు చైతూ. సినిమాకి సంబంధించిన కీలక విషయాలను తెలుసుకుంటూనే, మధ్య మధ్యలో సామ్‌తో విడాకుల ఇష్యూకి సంబంధించి కూడా ఏదో ఒక ప్రశ్న లేవనెత్తుతున్నారు. పాపం.! అస్సలు విసిగిపోకుండా చైతూ సమాధానమిస్తూనే వున్నాడు.
కానీ, ఈ విడాకుల ఘట్టం పూర్తయ్యాకా, నా నుంచి మూడు సినిమాలు రిలీజయ్యాయ్. కానీ, విడాకుల గోల మాత్రం తప్పడమే లేదు. ఈ పనికి రాని వార్తలతో నేను చాలా విసిగిపోతున్నా.. అంటున్నాడు చైతూ.
అయితే, అది ముగిసిపోయిన ఘట్టం అనుకోండి. భవిష్యత్‌లో ప్రేమలో పడే అవకాశముందా.? అని చైతూని అడిగితే, తప్పకుండా పడతాను. మనిషి బతకడానికి ఊపిరి ఎంత అవసరమో, అలాగే, ప్రేమ కూడా అంతే అవసరం. సంతోషంగా బతకడానికి, పాజిటివ్‌గా వుండడానికి ప్రేమ ఎంతో అవసరం..’ అని చైతూ సమాధానమిచ్చాడు.
ప్రేమ విషయంలో చైతూ అభిప్రాయం ఇలా వుంటే, సామ్ మాత్రం భవిష్యత్తులో తాను మళ్లీ ప్రేమలో పడే సాహసం చేయనని స్టేట్మెంట్ ఇచ్చేసింది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు