నరేంద్ర పన్నీరు కు గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రధానం
- August 07, 2022
తెలంగాణ: జగిత్యాలలోని తారకరామానగర్ చెందిన ఎన్నారై వ్యాపారవేత్త, ప్రముఖ సామాజిక సేవకులు నరేంద్ర పన్నీరు చేస్తున్న సేవలకు గుర్తింపుగా అమెరికా కు చెందిన గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ శనివారం రోజున పాండిచేరి లో జరిగిన విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ కార్యక్రమంలో డాక్టరేట్ ప్రధానం చేసి సర్టిఫికెట్ అందజేసింది.గత 20 సంవత్సరాలుగా గల్ఫ్ లొనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలలో సేవా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కరోనా సమయంలో వారు అందించిన సేవలు చాలా గొప్పవి. ఒమన్ లో హెల్ప్ డెస్క్ ప్రారంభించి కొన్ని వందల మందికి నెల రోజులకు సరిపడా సరుకులు అందించారు.కరోన మరియు బ్లాక్ ఫంగస్ సోకిన రోగుల వద్దకు వెళ్లి మందులు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ అందించి నేను ఉన్నాను అని భరోసా అందించారు.అనేక సేవా కార్యక్రమాలలో తనవంతుగా పాలుపంచుకుని వేలాది మంది జీవితాలలో వెలుగులు నింపుతూ సేవా లక్ష్యంతో ముందుకు సాగుతున్న నరేంద్ర పన్నీరు ను గుర్తిస్తూ పాండిచేరిలో జరిగిన యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ ప్రతినిధులు నరేంద్ర పన్నీరు కు గౌరవ డాక్టరేట్ అందజేసి ప్రత్యేకంగా గుర్తించారు .అనంతరం డాక్టర్ నరేంద్ర పన్నీరు మాట్లాడుతూ...తల్లి దండ్రులు చూపిన మార్గంలో తనవంతు బాధ్యత గా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నానని కాని ఈ సేవలకు గుర్తింపుగా అమెరికా కు చెందిన గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రధానం చేయడం పట్ల సంతోషాన్ని సంతృప్తిని వ్యక్తం చేస్తూ డాక్టరేట్ తన బాధ్యతలను మరింతగా పెంచింది అని పేర్కొన్నారు.ఈ సందర్భంగా నా ప్రతి పనిలో నాకు వెన్ను, దన్నుగా ఉన్న ఒమన్ తెలంగాణ ఫ్రెండ్స్ సభ్యులు కుమార్ మంచికట్ల, మురళి వడ్లపాటి, కార్తీక్ వంకాయల, వేమన కుమార్ కాశ, నాయుడు ముదిరాజ్, శ్యాం మామిడి, రమేష్ గరిగే, రమేష్ మార్గపు, గంగాధర్ వడ్ల, చెని ప్రభాకర్ మరియు మిత్రులకు, సన్నిహితులకు ముఖ్యంగా తన కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా కుమార్ మంచికట్ల మాట్లాడుతూ నరేంద్ర డాక్టరేట్ పొందటం చాలా ఆనందంగా ఉందని అన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు







