భారత్ కరోనా అప్డేట్
- August 07, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో నిన్న కొత్తగా 18,738 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఈరోజు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. శుక్రవారంతో పోలిస్తే కోవిడ్ కేసుల సంఖ్య శనివారం స్వల్పంగా తగ్గింది. దీంతో ఇప్పటి వరకు దేశంలో నమోదైన మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4,40,78,506కు చేరింది. ఇందులో 4,34,84,110 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,689 మరణించారు. ప్రస్తుతం దేశంలో 1,34,933 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కాగా, గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 40 మంది కోవిడ్ తదితర కారణాలతోమరణించారు. నిన్న 18,558 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా, రోజువారీ పాజిటివిటీ రేటు 5.02 శాతంగా నమోదయిందని తెలిపింది. ఇక రికవరీ రేటు 98.50 శాతం, యాక్టివ్ కేసులు 0.31 శాతంగా, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని ఆ నివేదిక వెల్లడించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 205.21 కోట్లకుపైగా కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్ర్రప్రభుత్వం పేర్కొన్నది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







