ఆకట్టుకుంటున్న ఆది సాయికుమార్ తీస్ మార్ ఖాన్ ట్రైలర్
- August 08, 2022
హైదరాబాద్: ఆది సాయికుమార్ హీరోగా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా తీస్ మార్ ఖాన్ అనే చిత్రం రాబోతుంది. విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 3 గా ప్రముఖ వ్యాపారవేత్త డా.నాగం తిరుపతి రెడ్డి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నాటకం వంటి విభిన్న కథాంశంతో కూడుకున్న చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకులను అలరించిన దర్శకుడు కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. ఈ చిత్రం ఆగస్ట్ 19న విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, పోస్టర్స్ సినిమా పట్ల ఆసక్తి పెంచాయి. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
2 నిమిషాల 42 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ ట్రైలర్ లో ప్రతి సన్నివేశం కూడా సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కట్టింది. *మా అమ్మను తప్పుగా చూశారు.. మా అమ్మ జోలికొస్తే ఏ అమ్మ కొడుకైనా కొడతా* అంటూ పదునైన డైలాగ్ తో ఆది సాయి కుమార్ ఎంట్రీ చూపించి ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ ఎంత పవర్ ఫుల్ అనేది చెప్పేశారు. పోలీస్ గా ఆది సాయి కుమార్ ఎలివేషన్ హైలైట్ చేస్తూనే కామెడీ పండించడం ఆసక్తికరంగా మారింది. గతంలో ఎన్నడూ చూడని విధంగా ఈ పోలీస్ రోల్ ఉండబోతోందని స్పష్టమయింది.
ఇలాంటి అందమైన అమ్మాయిలు అంత అందంగా డాన్స్ చేస్తుంటే ఎంత ఖర్చు పెడితే వస్తాయి చెప్పండి ఇలాంటి విజువల్స్..ఆది సాయి కుమార్ చెప్పిన డైలాగ్, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తో రొమాంటిక్ సీన్స్ ట్రైలర్ లో హైలైట్ అయ్యాయి. సాయి కార్తీక్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ వీడియోలో మరో హైలైట్. మొత్తంగా చూస్తే ఈ ట్రైలర్ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. చివరగా మీ TMK అని స్టైలిష్ గా చెబుతూ ఆగస్టు 19న థియేటర్స్ లో కలుద్దాం అన్నారు ఆది సాయి కుమార్.
స్టూడెంట్, రౌడీ, పోలీస్ గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆది సాయికుమార్ నటించడం ఈ సినిమాకు మేజర్ అసెట్. ఈ చిత్రానికి సంగీతం సాయి కార్తీక్ అందించగా.. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ చేశారు. మణికాంత్ ఎడిటర్ గా వర్క్ చేసి స్మార్ట్ అవుట్ పుట్ తీసుకొచ్చారు. సునీల్, అనూప్ సింగ్ ఠాకూర్, కబీర్ సింగ్ , పూర్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!