ఖతార్ లో తగ్గుముఖం పట్టిన కరోనా వ్యాప్తి
- August 09, 2022దోహా: గత వారం రోజుల్లో దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయని ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఓ నివేదికను విడుదల చేసింది. గత ఏడు రోజుల్లో కరోనా కారణంగా ఎటువంటి మరణాలు నమోదు కాలేదని తెలిపింది. గత 24 గంటల్లో(ఆగస్టు 8) కమ్యూనిటీ కేసుల సంఖ్య 712 కేసులు (107 ప్రయాణికుల కేసులు) నమోదైనట్లు పేర్కొంది. నివేదిక ప్రకారం.. రోజువారీ సగటు కేసులు 681కాగా.. ప్రయాణికులలో రోజువారీ సగటు రోజువారీ కేసులు 106గా ఉన్నది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 6,217 ఉండగా.. ఖతార్‌లో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కోవిడ్-19 కేసుల సంఖ్య 415,129గా ఉన్నది. ఇందులో 408,231 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు మొత్తం మరణించినవారి సంఖ్య 681గా ఉంది. వ్యాక్సినేషన్ లో భాగంగా ఇప్పటివరకు 7,339,048 మందికి టీకాలు(1,836,078 బూస్టర్ డోసులు) అందించారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్