BAPS హిందూ మందిర్ రక్షా బంధన్ ఉత్సవాలు..10 వేల రాఖీలు అందజేత
- August 09, 2022
అబుధాబి: రక్షా బంధన్ ను పురస్కరించుకొని అబుధాబిలోని BAPS హిందూ దేవాలయం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది.ఈ సందర్భంగా BAPS హిందూ మందిర్ మహిళా విభాగం చేతితో తయారు చేసిన 10,000 కంటే ఎక్కువ రాఖీలను కార్మికులు, ప్రవాసులు, నివాసితులకు అందజేశారు.BAPS హిందూ మందిర్ అధిపతి స్వామి బ్రహ్మవిహారిదాస్ నేతృత్వంలో ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇందులో పలు కంపెనీలకు చెందిన 4,000 మందికిపైగా ప్రవాస కార్మికులు పాల్గొన్నారు. సోదరీమణులతో కలిసి రక్షాబంధన్ జరుపుకోవడానికి తమల్ని ఆహ్వానించినందుకు స్వామికి కార్మికులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదో అద్భుత కార్యక్రమని సంతోషం వ్యక్తం చేశారు. 150 మంది మహిళా విభాగం సభ్యురాళ్లు..నెలకు పైగా కష్టపడి రాఖీలను తయారు చేశారు. అనంతరం ఆలయాని వచ్చే భక్తుల డేటాను క్రోడీకరించారు.ప్రతి మహిళా వాలంటీర్ 40 మంది భక్తులను చేరుకుని వ్యక్తిగతంగా రాఖీలు అందజేసినట్లు ఓ సీనియర్ వాలంటీర్ తెలిపారు.ఈ సందర్భంగా, భారతదేశంలో ఉన్న మహంత్ స్వామి మహారాజ్ సామరస్యం, సౌభ్రాతృత్వం కోసం ప్రార్థించిన వీడియో సందేశాన్ని ప్రదర్శించారు. అనంతరం భక్తులు ‘శిల స్థాపన’(పవిత్రమైన ఇటుక వేయడం) కార్యక్రమంలో పాల్గొన్నారు.అనంతరం స్వామి బ్రహ్మవిహారిదాస్ మాట్లాడుతూ.. రక్షాబంధన్ అనేది ప్రేమ, సమానత్వం, దైవత్వానికి ప్రతీక అన్నారు. ఈ వేల రాఖీలను UAEలోని మహిళా భక్తులు ప్రేమతో చేతితో తయారు చేశారని, ప్రతి కార్మికుడికి వాళ్ల సోదరీమణుల ప్రేమను అందించిందని పేర్కొన్నారు. ఈ థ్రెడ్ పరస్పర గౌరవం, ఐక్యతను సూచిస్తుందని, రాబోయే ఈ అందమైన మందిరం వంటి అద్భుతమైన ప్రాజెక్ట్‌లను నిర్మించడంలో సహాయం చేయడానికి అవిశ్రాంతంగా పని చేసే ఈ సోదరులకు సేవ చేస్తున్నందుకు తను నిజంగా గర్వపడుతున్నట్లు BAPS హిందూ మందిర్ చైర్మన్ అశోక్ కొటేచా అన్నారు.




తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







