మహిళ పోలీసుపై దాడి చేసిన మహిళకు జైలు శిక్ష
- August 09, 2022
బహ్రెయిన్: మద్యం మత్తులో బహ్రెయిన్ మహిళ పోలీసుపై దాడి చేసిన ఒక మహిళ(GCC జాతీయురాలు)కి హై క్రిమినల్ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. దాంతోపాటు ఆమెకు BD100 జరిమానాను కోర్టు విధించింది. శిక్ష పూర్తయిన తర్వాత ఆమెను శాశ్వతంగా బహిష్కరించాలని ఆదేశించింది. కోర్టు ఫైల్స్, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హోటల్ బీచ్‌లో ఇద్దరు మహిళల మధ్య గొడవ జరుగుతున్నట్లు సమాచారం అందగానే ఓ మహిళ పోలీసు సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. ఆ సమయంలో ఇద్దరు మహిళలు స్విమ్‌సూట్ ధరించి మద్యం మత్తులో ఉన్నారు. వారిని సెక్యూరిటీ డైరెక్టరేట్‌కు తీసుకువెళ్లే సమయంలో మహిళ పోలీసును దుర్భాషలాడారు. అలాగే డైరెక్టరేట్ కార్యాలయానికి రాగానే ఓ మహిళ తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమెని పట్టుకునేందుకు యత్నించిన మహిళ పోలీసుపై దాడికి పాల్పడింది. నిందితురాలి దాడిలో మహిళ పోలీసుకు తీవ్ర గాయాలు అయినట్లు వైద్య నివేదికలో వెల్లడైంది. దీంతో దాడికి పాల్పడ్డ నిందితురాలిని కోర్టు దోషిగా నిర్ధారించి జైలుశిక్ష, ఫైన్ విధించింది.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ USA మిల్వాకీ కార్యక్రమం విజయం 770 మందికి కంటి చూపు
- అంబులెన్స్‌లో మంటలు నలుగురు మృతి
- ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
- లండన్ మ్యూజియంలో అమరావతి శిల్ప సంపదను తెచ్చేందుకు చర్యలు
- 33వ అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సాల్మియాలో పార్క్ చేసిన వాహనాలు ధ్వంసం..!!
- విషాదం..ప్రమాదంలో బైక్ రైడర్ మృతి..!!
- సౌదీ అరేబియాకు F-35 ఫైటర్ జెట్స్..ట్రంప్
- రాకేష్ సమాచారం అందించినవారికి Dh25,000 రివార్డు..!!
- ఖతార్ లో ఆన్లైన్ లో ఖైదీల ఉత్పత్తులు..!!







