తెలుగు బిగ్ బాస్ 6 ప్రోమో రిలీజ్

- August 09, 2022 , by Maagulf
తెలుగు బిగ్ బాస్ 6 ప్రోమో రిలీజ్

హైదరాబాద్: నార్త్ లో సూపర్ సక్సెస్ అయినా బిగ్ బాస్..సౌత్ లోను అంతే సక్సెస్ అవుతూ వస్తుంది. తెలుగు లో అయితే ఈ షో కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. సీజన్ ..సీజన్ కు ప్రజలకు మరింత దగ్గరవుతుంది. ఇక ఇప్పుడు సీజన్ 6 తో అలరించేందుకు సిద్ధమైంది. దీనికి సంబదించిన ప్రోమో ను మంగళవారం రిలీజ్ చేసారు. ఎప్పటిలాగానే కింగ్ నాగార్జున సీజన్ 6 కు హోస్ట్ చేస్తున్నారు. ఇక ప్రోమో లోకి వెళ్తే.. బిగ్ బాస్‌లో ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కి కొదవే ఉండ‌దు అని చెప్పేలా క‌ట్ చేశారు. పెళ్లిలో అప్ప‌గింత‌లు అవుతుంటాయి. కొత్త పెళ్లి కూతురుకి సంబంధించిన అప్ప‌గింత‌లు అవుతుంటాయి.

ఆమె త‌ల్లిదండ్రులు క‌న్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. అంత‌లోనే వారి ఫోన్‌లోకి ఓ మెసేజ్ వ‌స్తుంది. వెంటనే పెళ్లి కొడుకు స‌హా అంద‌రూ మాయ‌మైపోతారు. ఎవ‌రూ లేక‌పోవ‌టంతో పెళ్లి కూతురు ఆశ్చ‌ర్య‌పోతుంది. వెంట‌నే నాగార్జున వైట్ డ్రెస్‌లో స‌లాడ్ తింటూ ఎంట్రీ ఇస్తారు. ‘‘అప్పగింతలు అయ్యే వరకు కూడా ఆగలేకపోయారంటే అక్క‌డ ఆట మొద‌లైన‌ట్టే. లైఫ్‌లో ఏ మూమెంట్ అయినా బిగ్ బాస్ త‌ర్వాతే. బిగ్ బాస్ సీజ‌న్ 6.. ఎంట‌ర్‌ట‌న్‌మెంట్‌కి అడ్డా ఫిక్స్‌’’ అంటూ నాగార్జున చెప్పే ప్రోమో డైలాగ్స్ వింటుంటే ఈసారి బిగ్‌బాస్ షోలో మ‌రింత ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను యాడ్ చేయ‌టానికి నిర్వాహ‌కులు ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తుంది. మరి ఈ సీజన్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com