విక్టరీ వెంకటేష్ అప్పుడు అలా, ఇప్పుడేమో ఇలా.!
- August 09, 2022
‘గోపాలా గోపాలా’ సినిమాలో విక్టరీ వెంకటేష్ దేవుడంటే అస్సలు ఇష్టం లేని పాత్ర (నాస్థికుడు)లో కనిపించి ఫ్యాన్స్ మన్ననలు పొందారు. ఆ సినిమాలో ట్రెండీ గాడ్‌గా కనిపించి పవన్ కల్యాణ్ మెప్పించారు.
కాగా, ఇప్పుడు అదే తరహా పాత్రలో నటించే అవకాశం వెంకటేష్‌కి దక్కిందట. అదేనండీ, దేవుడి పాత్రలో. పాత్ర లెంగ్త్ చిన్నదే కానీ, సినిమాకి చాలా కీలకమట. ఆ పాత్ర కోసం వెంకటేష్ అయితే బాగుంటుందని భావించి ఆయననే ఈ పాత్ర కోసం ఎంగేజ్ చేశారట.
ఇంతకీ ఏ సినిమా కోసం అంటారా.? ‘ఫలక్‌నుమా దాస్’ , ‘హిట్’ తదితర సినిమాలతో హీరోగా స్పెషల్ గుర్తింపు దక్కించుకుని, ఇటీవల ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమాకి ప్రమోషన్ల పేరు చెప్పి వివాదాల్లో సెన్సేషనల్ అయిన విశ్వక్ సేన్ హీరోగా రూపొందుతోన్న సినిమా కోసం.
ఓ సూపర్ హిట్ తమిళ రీమేక్ (ఓ మై కడలిలే)లో విశ్వక్ సేన్ నటిస్తున్నాడు. తెలుగులో ఈ సినిమాని ‘ఓరి దేవుడా’ టైటిల్‌తో రిలీజ్ చేస్తున్నారు. ఒరిజినల్ డైరెక్టర్ అశ్వత్ మరముత్తునే ఈ సినిమాని తెలుగులోనూ రూపొందిస్తున్నారు. ఒరిజినల్‌లో విజయ్ సేతుపతి పోషించిన దేవుడి పాత్ర కోసం తెలుగులో వెంకీని ఒప్పించారట.
వెంకటేష్ కూడా ఈ పాత్రను చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడంతో, డీల్ సెట్ అయిపోయింది. త్వరలోనే వెంకీ తన పార్ట్ షూటింగ్ పూర్తి చేయనున్నారట. వెంకీ ఎంట్రీతో విశ్వక్ సినిమాకి స్టార్‌డమ్ యాడ్ అయిపోయింది. చూడాలి మరి, ‘ఓరి దేవుడా’ సినిమాతో విశ్వక్ ఎలాంటి కొత్త సెన్సేషన్‌కి తెర లేపనున్నాడో.!
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్‌లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్‌ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







