మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ
- August 09, 2022
ముంబై: ఎట్టకేలకు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి చెందిన మంత్రి వర్గ విస్తరణ పూర్తి అయ్యింది. 18 మందితో మహారాష్ట్ర క్యాబినెట్ కొలువుదీరింది. మంత్రివర్గంలో బీజేపీ నుంచి తొమ్మిది, షిండే వర్గం నుంచి తొమ్మిది మందికి చోటు లభించింది. ఉదయం 11 గంటలకు రాజ్ భవన్ లో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ 18 మంది ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు.
ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వర్గం
చంద్రకాంత్ పాటిల్
సుధీర్ మునగంటివార్
గిరీష్ మహాజన్
సురేష్ ఖడే
రాధాకృష్ణ విఖే పాటిల్
రవీంద్ర చవాన్
మంగళ్ ప్రభాత్ లోధా
విజయ్ కుమార్ గవిత్
అతుల్ సేన్ లు ఉన్నారు..
ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గం
దాదా భుసే
శంభురాజ్ దేశాయ్
సందీపాన్ భుమారే
ఉదయ్ సామంత్
తానాజీ సావంత్
అబ్దుల్ సత్తార్
దీపక్ కేసర్కర్
గులాబ్ రావ్ పాటిల్
సంజయ్ రాథోడ్ లు ఉన్నారు
అయితే, బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ కు హోంమంత్రిత్వ శాఖ దక్కనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు షిండే, ఫడ్నవీస్ ముందుగా కుదుర్చుకున్న 35–65 ఫార్మూలా ప్రకారం.. ప్రస్తుతతం మినీ మంత్రివర్గ విస్తరణ జరిగింది.
కాగా, మహారాష్ట్రలో అధికార శివసేన పార్టీలో తిరుగుబాటు కారణంగా ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే తన పదవికి రాజీనామా చేశారు. దీంతో జూన్ 30న మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏకనాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ లు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత ఇప్పటివరకు ఇద్దరు సభ్యులతోనే క్యాబినెట్ కొనసాగింది. దీనిని ఎన్‌సిపి నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌తో పాటు అనేకమంది ప్రతిపక్ష నాయకులు విమర్శించారు.
అయితే, విపక్షాల విమర్శలపై ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. అజిత్ పవార్ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారని.. తాను ప్రభుత్వంలో ఉన్న సమయంలో తొలి 32 రోజుల్లో.. ఆయన కేబినెట్ లో ఐదుగురు మంత్రులే ఉన్నారనే విషయం ఆయన మరిచిపోయారన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, మంత్రుల ప్రమాణస్వీకారం జరిగింది.
తాజా వార్తలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్‌లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ







