జాక్‌పాట్ కొట్టేసిన వేణు తొట్టెంపూడి
- August 09, 2022
వేణు తొట్టెంపూడి.. ఒకప్పుడు మినిమమ్ గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత హీరోగా ఆఫర్లు రాక, ‘దమ్ము’ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి ఆ తర్వాత మాయమైపోయాడు.
లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ ఇప్పుడే వేణు తొట్టెంపూడి లైన్‌లోకి వచ్చాడు. మాస్ రాజా రవితేజ నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాతో వేణు తొట్టెంపూడి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా హిట్ అయ్యి వుంటే లెక్క మరోలా వుండేది. కానీ, ఆశించిన రిజల్ట్ ఇవ్వలేదు ఈ సినిమా.
అయినా కానీ, వేణుకి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయట. అందులో వేణు హీరోగా ఓ సినిమా కూడా వుందట. ఫన్ బకెట్ సంస్థ నిర్మిస్తున్న సినిమా అది. ఆ సంగతి అటుంచితే, క్రేజీ కాంబినేషన్ సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందబోయే సినిమాలో వేణుకి ఓ ఇంపార్టెంట్ రోల్ ఆఫర్ చేశారట.
అది మహేష్‌కి అన్న పాత్రనీ తెలుస్తోంది. సినిమాకి ఎంతో కీలకమైన పాత్రట ఇది. గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల రచయితగా వున్నప్పుడు ఆయనతో కలిసి చాలా సినిమాలు చేశాడు వేణు. అలా త్రివిక్రమ్‌తో వేణుకి మంచి అనుబంధం వుంది. ఆ అనుబంధంతోనే వేణు కోసం స్పెషల్‌గా ఈ క్యారెక్టర్ ఆఫర్ చేశాడట త్రివిక్రమ్ శ్రీనివాస్.
చూస్తుంటే, సెకండ్ ఇన్నింగ్స్‌లో వేణు తొట్టెంపూడి బిజీ అయిపోయేటట్లే వున్నాడు. కాగా, ప్రస్తుతం కాస్టింగ్ వెతికే పనిలో వున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని, త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లనుందనీ తెలుస్తోంది.
తాజా వార్తలు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా