చైనాను వణికిస్తున్న కొత్త రకం వైరస్..
- August 10, 2022
చైనా: ప్రస్తుతం కరోనా వైరస్ చైనా లో అదుపులోనే ఉన్న తరుణంలో మంకీపాక్స్ రూపంలో కొత్త వైరస్ చైనా ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. దానివల్ల పెద్దగా ప్రమాదం లేదని భావిస్తున్న తరుణంలోనే మరో కొత్త వైరస్ చైనా ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది.
చైనా దేశంలో జూనోటిక్ లాంగ్యా ( Zoonotic Langya) వైరస్ స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కరోనా మహమ్మారితో తీవ్ర ఇబ్బందులు ఎధుర్కొన్న చైనీయులు ప్రస్తుతం కొత్తగా వెలుగులోకి వచ్చిన వైరస్ తో ఇంకెన్ని ఇబ్బందులు పడాలోనని ఆందోళణ చెందుతున్నారు. అయితే ఈ కొత్త వైరస్ 35 మందికి సోకింది. తైవాన్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (TCDC) ప్రకారం.. జూనోటిక్ లాంగ్యా అనే ఈ వైరస్ చైనాలోని షాన్‌డాంగ్, హెనాన్ ప్రావిన్సులలో కనుగొనబడిందని, తైవాన్ లో ఈ వైరస్‌ను పర్యవేక్షించడానికి, గుర్తించడానికి కొత్త పద్ధతిని అవలంబిస్తున్నారని, దీనికి న్యూక్లియిక్ యాసిడ్ టెస్టింగ్ మెథడ్ అని పేరు పెట్టారని ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ తెలిపింది.
తైవాన్ కు చెందిన సీడీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చువాంగ్ జెన్ హ్సియంగ్ ఆదివారం మాట్లాడుతూ.. ఒక అధ్యయనం ప్రకారం.. ఈ వైరస్ మనుషుల మధ్య వ్యాప్తి చెందుతుందా లేదా అనేది ఇంకా నిర్ధారించలేదని తెలిపాడు. అయితే ఈ వైరస్ పట్ల ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పెంపుడు జంతువులపై నిర్వహించిన సెరోలాజికల్ సర్వే సమాచారం ప్రకారం.. పరీక్షల్లో మేకలలో రెండు శాతం, కుక్కల్లో ఐదు శాతం పాజిటివ్ గా తేలిందని అక్కడి వైద్యులు పేర్కొన్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ తెలిపింది. ఇదిలాఉంటే చైనాలోకి ఈ వైరస్ 35 మందికి సోకిందని, అయితే ఒకరికొకరు సన్నిహిత సంబంధాలు లేవని చువాంగ్ చెప్పారు. 26 మందిలో జ్వరం, ఆయాసం, దగ్గు, ఆకలి మందగించడం, కండరాల నొప్పి, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపించాయని ఆయన చెప్పారు.
ఈ వైరస్ వల్ల ప్లేట్ లైట్స్ తగ్గిపోవటం, కాలేయం, మూత్రపిండాలపై ప్రభావం చూపుతుందని వైద్యులు గుర్తించారు. చైనాలోని కరోనావైరస్ విషయానికి వస్తే.. చైనా యొక్క జీరో-కోవిడ్ విధానం కారణంగా షాంఘై నివాసితులు చాలా కఠినమైన లాక్‌డౌన్‌ను ఎదుర్కొన్నారు. కొత్త వైరస్ తో మరోసారి అలాంటి పరిస్థితి వస్తుందా అన్న ఆందోళన అక్కడి ప్రజల్లో వ్యక్తమవుతుంది.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







