దోహా వీధుల్లో మరో 40 కళాఖండాలు
- August 10, 2022
దోహా: ఖతార్ క్రియేట్స్‌లో భాగంగా ఖతార్‌లోని సాంస్కృతిక కార్యక్రమాల వైవిధ్యాన్ని తెలియజేసేలా దోహా వీధుల్లో మరో 40 కళాఖండాలను ఏర్పాటు చేయనున్నట్లు ఖతార్ మ్యూజియం ప్రకటించింది. ఇందుకోసం అంతర్జాతీయ కళాకారులు దోహా, ఇతర ప్రాంతాల్లో తమ కళాఖండాలను ప్రదర్శించనున్నట్లు పేర్కొంది. ఖతారీ ఎడారి నుండి సందడిగా ఉండే సౌక్ వాకిఫ్ వరకు రాబోయే రోజుల్లో 100 కంటే ఎక్కువ పబ్లిక్ ఆర్ట్‌వర్క్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ఖతార్ మ్యూజియమ్స్ చైర్‌పర్సన్ హెచ్ ఇ షేఖా అల్ మయాస్సా బింట్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ తెలిపారు. పార్కులు, షాపింగ్ ప్రాంతాలు, విద్యా, అథ్లెటిక్ సౌకర్యాలు, హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, క్యూ-రైల్ స్టేషన్‌లు, అలాగే ప్రపంచ కప్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చే స్టేడియాలతో సహా బాటసారులను ఆకట్టుకునేలా.. ఆహ్లాదపరిచేలా పబ్లిక్ స్పేస్‌లలో అంతర్జాతీయ ప్రసిద్ధ కళాకారులు రూపొందించిన కళాఖండాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







