కెమెరాలు అటు తిప్పండి ప్లీజ్.! ఫోటోగ్రాఫర్లతో వాగ్వాదానికి దిగిన తాప్సీ.!
- August 10, 2022
వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే తాప్సీ, సరికొత్తగా ఓ కొత్త వివాదంలో ఇరుక్కుంది. ఓ ఈవెంట్‌కి సంబంధించి, తాప్సీ ఫోటోగ్రాఫర్లతో వాగ్వాదానికి దిగింది. ఫోటోలకు పోజులిచ్చేందుకు నిరాకరించింది. తాప్సీని ఫోటోలు తీసేందుకు అప్పటికే చాలా సమయం నుంచి వెయిట్ చేస్తున్న ఫోటోగ్రాఫర్లు తాప్సీ బిహేవియర్‌కి అసహనం వ్యక్తం చేశారు.
అయితే, ఈ ఇష్యూ పెద్దది కాకుండా, చాకచక్యంగా తాప్సీ తప్పించుకుంది. ఆమె తాజా చిత్రం ‘దొబారా’ ప్రమోషనల్ ఈవెంట్‌లో భాగంగా, ఈవెంట్‌కి లేటయిపోతుందంటూ, ఫోటోల కోసం ఇంకాస్త సమయం వెయిట్ చేయండి.. అంటూ ఫోటోగ్రాఫర్లను కోరుతూ, లోపలికి వెళ్లబోయింది.
కానీ, అప్పటికే విసిగిపోయిన ఫోటోగ్రాఫర్లలో ఒకరు తాప్సీని స్ర్టెయిట్‌గా ప్రశ్నించారు. గౌరవంగా మాట్లాడండి.. అంటూ తాప్సీ కూడా మౌత్ రైజ్ చేసింది. కానీ, చివరికి, ఈ వివాదం సద్దుమనిగిపోయింది.
ఇలాంటివి తాప్సీకి మామూలే కానీ, ఈ సారి కాస్త సంయమనమే పాఠించింది తాప్సీ. మొదట ఏం జరిగినా సెలబ్రిటీలనే తప్పు పడతారు. మీది ఏం తప్పు లేదు.. అంటూ మీడియాపై కస్సు బుస్సులాడుతూనే, తర్వాత చిరునవ్వులు చిందిస్తూ, వారితో సంధి కుదుర్చుకుంది. మీడియాతో పెట్టుకుంటే అంత వీజీ కాదుగా. ఆ మాత్రం తెలియనిది కాదు తాప్సీ. అందుకే కామ్ అయిపోయినట్లుంది.
ఇకపోతే, ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే, ఈ మధ్య నిర్మాతగానూ మారింది తాప్సీ. తన నిర్మాణంలో సమంత హీరోయిన్‌గా తాప్సీ ఓ సినిమాని రూపొందిస్తున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించింది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







