కాంగో జైలు పై తీవ్రవాదుల దాడి..

- August 11, 2022 , by Maagulf
కాంగో జైలు పై తీవ్రవాదుల దాడి..

కాంగో: రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని బుటెంబోలో ఉన్న జైలుపై కొంత మంది దాడి చేసి సుమారు 800 మంది ఖైదీలను విడుదల చేసినట్లు స్థానిక అధికారులు బుధవారం వెల్లడించారు. కట్టుదిట్టమైన ఆయుధాలతో వచ్చిన దుండగులు ఇస్లామిక్ తీవ్రవాద గ్రూపుకు చెందిన వారని కాంగో అధికారులు చెబుతున్నారు. కాగా, తీవ్రవాదలు చేసిన ఈ దాడిలో ఒద్దరు పోలీసులు ఒక పౌరుడు మరణించారు. అర్థరాత్రి జైలుకు చేరుకున్న పదుల సంఖ్యలోని మిలిటెంట్లు.. కాల్పులు జరుపుతూ జైలుకు నిప్పు పెట్టారు.

‘‘శత్రువులు చాలా ఆయుధ సామాగ్రితో వచ్చారు. వాళ్లు సుమారుగా 80 మంది ఉంటారు. వారు జైలు గేట్లు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. అనంతరం ఖైదీలందరినీ విడుదల చేశారు’’ అని మలుషాయి అనే అధికారి తెలిపారు. అయితే సదరు జైలు డైరెక్టర్ బ్రునెల్లె నకాసా ఈ ఘటనపై కాస్త నాన్చుతూ సమాధానం ఇచ్చారు. మొత్తం 874 మంది ఖైదీలు ఉంటే కేవలం 58 మంది మాత్రమే జైలు నుంచి వెళ్లిపోయారని అన్నారు. కానీ వాస్తవ లెక్కల ప్రకారం.. జైలులో ఉన్న ఖైదీలంతా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

కాంగోలో ఇలాంటి ఘటనలు జరగడం సాధారణమే. అలైడ్ డమొక్రటిక్ ఫోర్సెస్ అనే తీవ్రవాద సంస్థ 2020లో బెనిలోని ఒక జైలుపై దాడి చేసి 1,300 మంది ఖైదీలను విడుదల చేసింది. కాగా, ప్రస్తుతం జరిగిన ఘటన కూడా ఏడీఎఫ్ పనేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఉగాండా స్థావరంగా పని చేసే ఈ సంస్థ 1990లో తూర్పు కాంగోలో మొదటిసారి ఏర్పడింది. ఇది ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలతో కలిసి పని చేస్తున్నారనే వాదనలు ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com