చిన్నారిని వేధించిన కేసులో విదేశీయుడు అరెస్ట్

- August 12, 2022 , by Maagulf
చిన్నారిని వేధించిన కేసులో విదేశీయుడు అరెస్ట్
రియాద్: దివ్యాంగ చిన్నారిని వేధించిన  వీడియో ఇంటర్నెట్ లో వైరల్ కావడంతో అందుకు కారణమైన ప్రవాసీ వాసిని సౌదీ పోలిసులు అరెస్ట్ చేశారు.నజ్డ్ లోని వాడి అడ్-దవాసిర్ పట్టణంలోని పరిసరాల్లోని సీసీ టివీ ఫూటేజీ లో ఈజిప్ట్ దేశానికి చెందిన వ్యక్తి  దివ్యాంగ పిల్లవాడిని కొట్టడం కనిపించడంతో ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న సౌదీ అరేబియా అటార్నీ జనరల్ షేక్ సౌద్ బిన్ అబ్దుల్లా అల్ ముజెబ్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. 
 
దేశ శిక్షాస్మృతి ప్రకారం చిన్న పిల్లలను ఏ విధమైన ఇబ్బందులకు గురి చేసినా బాలల రక్షణ చట్టానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.  
 
 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com