FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022.. పెరిగిన అద్దెలు
- August 13, 2022
దోహా: FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022 కంటే ముందే రెసిడెన్షియల్ అద్దెలు పెరిగాయి. రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ రంగం ఈ సంవత్సరం రెండవ త్రైమాసికంలో (Q2) అద్దెలలో బలమైన వృద్ధిని సాధించింది. ముఖ్యంగా అపార్ట్మెంట్ల ధరుల అత్యధికంగా పెరిగాయని కుష్మాన్ & వేక్ఫీల్డ్ తన నివేదికలో తెలిపింది. FIFA ప్రపంచ కప్‌కు ముందు పెరిగిన డిమాండ్ల కారణంగా అద్దెలు 30 శాతానికి పైగా పెరిగాయని నివేదిక పేర్కొంది. Q1లో 5-7 శాతం వృద్ధిని అనుసరించి.. నవంబర్, డిసెంబర్లలో జరిగే FIFA ప్రపంచ కప్‌కు సంబంధించి నెలకొన్న డిమాండ్ నేపథ్యంలో ఏప్రిల్, మే నెలల్లో రెసిడెన్షియల్ అద్దెల పెరుగుదలకు కారణమైందని నివేదిక తెలిపింది. పోర్టో అరేబియాలో 2021లో QR10,000 – QR12,000కి అందుబాటులో ఉన్న సాధారణ రెండు పడకగదులు, సెమీ-ఫర్నిష్డ్ అపార్ట్మెంట్లు ఇప్పుడు QR13,000 – QR15,000కి పెరిగాయి. ఇదే సమయంలో రెసిడెన్షియల్ సేల్స్ లావాదేవీల సంఖ్య గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే సంవత్సరంలో మొదటి ఐదు నెలల్లో 19 శాతం తగ్గడం విశేషం.
తాజా వార్తలు
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్‌ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!







