రష్మిక షాకింగ్ కామెంట్స్: ఒక నటిని అడగాల్సిన ప్రశ్నేనా ఇది.!
- August 13, 2022
నటిని కాబట్టి, సంవత్సరానికి ఐదారు సినిమాలు చేస్తుంటాను.. అలాంటప్పుడు మీరు నన్ను కేవలం సినిమాలకు సంబంధించిన ప్రశ్నలే అడగాలి. కానీ, ఎఫైర్స్కి సంబంధించిన ప్రశ్నలే ఎక్కువగా అడుగుతారెందుకు.? అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో మీడియాని ప్రశ్నించింది నేషనల్ క్రష్ రష్మిక.
సెలబ్రిటీలన్నాకా, వారి వ్యక్తిగత విషయాలపై ఆమాత్రం ఆసక్తి వుంటుంది. మీడియాకి స్టఫ్ ఇవ్వాలంటే, ఆయా సెలబ్రిటీల ఎఫైర్ న్యూసే బాగా వర్కవుట్ అవుతుంటాయ్. ఆ చిన్నపాటి లాజిక్ తెలియనిది కాదు, రష్మిక. అందుకే తన ప్రశ్నను తానే మళ్లీ కవర్ చేసింది భలేగా.
నా పర్సనల్ లైఫ్ మీద ఆసక్తి వుండడం సహజమే కానీ, ఎఫైర్ల విషయం మాత్రం నేను కన్ఫామ్ చేసే వరకూ నమ్మొద్దు ప్లీజ్ అని కవరింగ్ ఇచ్చేసింది. అవునులే. రష్మిక చాలా బోల్డ్. ఒకవేళ ఎఫైర్ వుంటే, వుంది.. అని నెట్టింటి వేదికగా డప్పు కొట్టి మరీ చెప్పేస్తుంది.
అయితే, గత కొంత కాలంగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో రష్మిక డేటింగ్లో వున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఓ షోలో విజయ్ దేవరకొండను రష్మిక గురించి అడిగితే, ‘డార్టింగ్’ అని సంబోధించాడు. దాంతో, ఆ ప్రచారానికి ఒకింత బలం చేకూరినట్లే అయ్యింది. కానీ, రష్మిక మాత్రం ఇలా రెస్పాండ్ అయ్యింది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







