కృతిశెట్టి పని అయిపోయినట్లేనా.?
- August 13, 2022
ఒక్క హిట్టొస్తే చాలు ఆ హీరోయిన్‌ని నెత్తికెక్కించేసుకుంటారు.అలాగే, ఫ్లాప్ కూడా.అలాంటిది రెండు వరుస ఫ్లాపులు.. కృతిశెట్టి ఇమేజ్‌ని బాగా డ్యామేజ్ చేసేసేటట్లున్నాయ్.
కృతి శెట్టి తాజాగా నటించిన ‘మాచర్ల నియోజక వర్గం’ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిందన్న టాక్ వినిపిస్తోంది. నితిన్ మాస్ మసాలా ట్రీట్ అంటూ ఈ సినిమాని ఓ రేంజ్‌లో ప్రమోట్ చేశారు. కానీ, నితిన్ నిలబడలేకపోయాడు. ‘మాచర్ల’లోని మాస్ ఎలిమెంట్స్ ఆడియన్స్‌ని ఇంప్రెస్ చేయలేకపోయాయ్.
ఆ ఇంపాక్ట్ నితిన్ మీద ఎంతుందో ఏమో.. ఆ సంగతి పక్కన పెడితే, కృతి శెట్టి కెరీర్‌పై చాలా ఇంపాక్ట్ చూపించింది. ఈ మధ్య వరుసగా చాలా సినిమాలు కృతి శెట్టి నుంచి వచ్చాయ్. ఆ మాటకొస్తే, ఈ మధ్య వచ్చిన సినిమాల్లో ఏ సినిమా చూసినా హీరోయిన్‌గా కృతి శెట్టినే కనిపించేంతలా అన్నమాట.
అయితే, వాటిలో ఏ ఒక్క సినిమా ఆశించిన స్థాయి హిట్ కానీ, కెరీర్ బెస్ట్ హిట్ కానీ, నమోదు చేయలేకపోయింది. \ఇక ప్రస్తుతం ఆమె చేతిలో ఒకే ఒక్క సినిమా వుంది. అదే ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. పెద్దగా అంచనాల్లేని సినిమా ఇది.
సుధీర బాబు హీరోగా, ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్‌లో రూపొందుతోంది.సెప్టెంబర్‌లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక్కోసారి ఎలాంటి అంచనాల్లేకుండా, చిన్న సినిమా అన్నవే పెద్ద హిట్స్ అవుతుంటాయ్. అలా, కృతి శెట్టికి ఏమైనా ఈ సినిమా కలిసొస్తుందేమో చూడాలి మరి.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







