గుట్కా, పాన్ మసాలా, పొగాకు లపై నిషేధం : ఢిల్లీ
- April 14, 2016
ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే గుట్కా, పాన్ మసాలా, పొగాకు సంబంధిత పదార్థాల ఉత్పత్తులపై ఢిల్లీ ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం విధించింది. ఈ మేరకు ఆహార భద్రతా శాఖ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. గుట్కా, పాన్ మసాలాలతో పాటు ఖైనీ, జర్దా పాన్ లపై కూడా నిషేధం కొనసాగనుంది. పొగాకు ఉత్పత్తుల అమ్మకం, కొనుగోలు, నిల్వలపై ఆరోగ్య విభాగం విధించిన నిషేధం నేటి నుంచి అమల్లోకి రానుంది.ఈ నిషేధం ఏడాది పాటు అమల్లో ఉంటుంది. కాగా ఫుడ్‌సేఫ్టీ యాక్ట్-2006 ప్రకారం గుట్కాలు, పాన మసాలాలతోపాటు చాప్‌టొబాకో, ఖైనీ, ఖరా, టొబాకో ఫ్లేవర్డ్ మసాలాల తయారీ, అమ్మకాలు, నిల్వ ఈ చట్టం పరిధిలోకి వస్తుందని ఢిల్లీ సర్కార్ పేర్కొంది. నిషేధాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు చేపడతామని సంబంధిత శాఖ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తిరుమల: శోభాయమానంగా పుష్పపల్లకీ సేవ
- సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పించిన టాస్క్ ఫోర్స్
- జూలై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాలపు సమావేశాలు
- ఐసిసి ర్యాంకింగ్ లో 'కింగ్' విరాట్ కోహ్లినే!!
- సిరియా సైనిక ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి
- కేంద్ర మంత్రి పాటిల్ సమక్షంలో చంద్రబాబు, రేవంత్ భేటి
- శ్రీవాణి టికెట్ల కేంద్రంలో సౌకర్యాలు కల్పించండి: టీటీడీ ఈవో శ్యామలరావు
- సలాలా అగ్రిటూరిజం ప్రాజెక్టులో గణనీయమైన పురోగతి..!!
- అబుదాబిలో 12 ప్రైవేట్ స్కూల్స్ పై నిషేధం..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్.. మిర్దిఫ్లో ట్రాఫిక్ డైవెర్షన్స్ అమలు..!!