ఏటీసీ టైర్ల పరిశ్రమను ప్రారంభించిన ఏపీ సీఎం జగన్
- August 16, 2022
అమరావతి: అచ్యుతాపురం సెజ్‌లో ఏటీసీ టైర్ల పరిశ్రమను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. సెజ్‌లోరూ.1,002.53 కోట్లతో మరో ఎనిమిది పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు. అచ్యుతాపురం సెజ్‌లో తొలి దశలో రూ.1,384 కోట్లతో యూనిట్ ఏర్పాటు చేయగా.. రూ.816 కోట్లతో రెండో దశ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… దేశం కంటే ఏపీ జీడీపీ ఎక్కువగా ఉందన్నారు. గతంలో రాష్ట్రం వైపు చూడని వారు.. ఇప్పుడు ఫ్యాక్టరీలు పెడుతున్నారన్నారు. గతంలో ఎప్పుడూ రాష్ట్రంలో అడుగు పెట్టని ఆదాని.. తాను సీఎం అయ్యాకే.. ఆదాని అడుగులు ఏపీ వైపు పడ్డాయన్నారు. ప్రభుత్వం ఇచ్చిన సహకారంతోనే ఏటీసీ రెండో ఫేజ్ ఏర్పాటుకు ముందుకు వచ్చిందన్నారు.
ఆగస్టు 2023 నాటికి రెండో ఫేజ్ పనులు పూర్తి చేసే అవకాశం ఉందని.. ఒక ప్రాంత అభివృద్ధికి మెరుగైన ఉపాధి అవకాశాలు కావాలి అన్నారు. ఈ మూడేళ్లలో 17 భారీ పరిశ్రమల ద్వారా రూ.39వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని.. ప్రభుత్వం పరిశ్రమలకు పూర్తి సహకారం అందిస్తోందన్నారు. మూతపడ్డ MSMEలకు కూడా చేయూతనిస్తున్నామని గుర్తు చేశారు. వచ్చే రెండేళ్లలో మరో 56 కంపెనీలు రాబోతున్నాయని.. మొత్తం రూ.1.54కోట్లతో లక్ష మందకిపైగా ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నంబర్ వన్‌గా ఉందని ఏటీసీ కంపెనీ సీఈవో నితిన్ అన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని.. ప్రపంచంలోనే బెస్ట్ ప్లాంట్‌గా యూనిట్‌ను తయారు చేస్తామన్నారు. రూ. 2,200 కోట్ల పెట్టుబడితో ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు.
తాజా వార్తలు
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..







