రాజమౌళి శిష్యుడొస్తున్నాడోచ్.!

- August 18, 2022 , by Maagulf
రాజమౌళి శిష్యుడొస్తున్నాడోచ్.!

75 ఏళ్ల స్వాతంత్ర్యం సందర్భంగా స్వాతంత్ర్య దినోత్సవ వారోత్సవాలు దేశం మొత్తం ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ‘హర్ ఘర్ తిరంగా’ పేరుతో ప్రతీ ఇంటిపైనా జాతీయ జెండా రెపరెపలాడుతూ ప్రతి ఒక్కరిలోనూ దేశభక్తిని చాటి చెబుతోంది.ఈ సందర్భంగా ఓ దేశ భక్తి చిత్రం చర్చకు వచ్చింది.
‘1770’ అనే టైటిల్‌తో రూపొందుతోన్న చిత్రమిది. ప్రముఖ బెంగాలీ రచయిత బంకించంద్ర ఛటర్జీ రచించిన ‘ఆనంద్‌మఠ్’ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. తెలుగుతో సహా పలు భాషలలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారట. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా మోషన్ పోస్టర్‌ని ఘనంగా రిలీజ్ చేశారు. 
రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో ‘ఆకాశ వాణి’ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు అశ్విన్ గంగరాజు. ఈ సినిమాకి రాజమౌళి నుంచి బాగా సపోర్ట్ లభించిందట. ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకి కథ, స్ర్కీన్‌ప్లే అందిస్తున్నారు. 
దేశ భక్తి కథాంశం కావడంతో, ఈ సినిమాకి సంబంధించి పీరియాడిక్ సెట్స్, పీరియాడిక్ ఎమోషన్స్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టబోతున్నారట. స్వాతంత్ర్య సమరానికి స్పూర్తి నింపిన యోధులెందరో ఈ సినిమాలో ప్రస్థావనకొస్తారట. నటీనటులు, మిగిలిన టెక్నీషియన్స్ వివరాలు దీపావళికి వెల్లడి చేయనున్నారట. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com