‘గాడ్ ఫాదర్’ టీజర్: చిరంజీవి బర్త్‌డేకి ఒక్క రోజు ముందే.!
- August 18, 2022
ఆగస్టు మంత్ మెగా అభిమానులకు చాలా ప్రత్యేకమైన మాసం. ఎందుకంటే, తమ అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఈ నెలలో వుండడమే. ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఈ సందర్భంగా సెలబ్రేషన్స్‌తో పాటూ, చిరంజీవి నటించే సినిమాలకు సంబంధించి అనేక అప్‌డేట్స్ వస్తాయని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.
అందులో భాగంగానే, ‘గాడ్ ఫాదర్’ మూవీ టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. చిరంజీవి పుట్టినరోజుకు ఒక్కరోజు ముందే, అంటే, ఆగస్టు 21న ‘గాడ్ ఫాదర్’ సినిమా టీజర్ రిలీజ్ కానుందట.
ఇటీవలే, చిరంజీవి ఎంట్రీకి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేసి, ఫ్యాన్స్‌ని మెస్మరైజ్ చేసిన సంగతి తెలిసిందే. సునీల్ కారు డోర్ తీస్తుండగా, అందులోంచి దిగిన అన్నయ్య అలా హుందాగా నడిచొస్తున్న గ్లింప్స్ అది. మెగా ఫ్యాన్స్ అంతా పండగ చేసుకున్నారు దీనికే.
ఇక టీజర్‌లో ఇంకెంత చూపిస్తారో.. అంటూ మెగా ఫ్యాన్స్ క్యూరియాసిటీతో వున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’కి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుండగా, నయన తార హీరోయిన్‌గా నటిస్తోంది.
తాజా వార్తలు
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్‌పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..







