‘డీజె టిల్లు’గాడితో ‘పెళ్లిసందడి’ బ్యూటీ ధూమ్ ధామ్: మామూలుగా వుండదు.!

- August 18, 2022 , by Maagulf
‘డీజె టిల్లు’గాడితో ‘పెళ్లిసందడి’ బ్యూటీ ధూమ్ ధామ్: మామూలుగా వుండదు.!

‘డీజె టిల్లుగాడు.. ఈని స్టైలే వేరు..’ అంటూ దుమ్ము రేగ్గొట్టేశాడు ఇటీవల ఓ యంగ్ హీరో. ఏడాది పిల్లోడి దగ్గర్నుంచి 60 ఏళ్ల ముసలోడి దాకా, ఈ ‘డీజె టిల్లు’ పాటకి ఓ రేంజ్‌లో స్టెప్పులిరగదీశారు. అంత హుషారు చూపించాచ్ ఈ సాంగ్‌లో మ్యూజిక్ బీట్స్. 
అఫ్‌కోర్స్.! సినిమా కూడా సూపర్ హిట్ అయ్యిందనుకోండి. ఇక ఈ టిల్లుగాడు.. అదేనండీ సిద్ధు జొన్నలగడ్డ ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు. అన్నింటికీ మించి ‘డీజె టిల్లు’ సీక్వెల్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టాడు. 
మొదటి పార్ట్ ఇంచ్చిన ఇంపాక్ట్‌తో రెండో పార్ట్ కోసం విదేశాలకు చెక్కేయనున్నాడట. ఈ సినిమాలో ఎక్కువ పార్ట్ విదేశాల్లోనే షూట్ చేయాలని అనుకుంటున్నారట. కథా, కథనం ప్రకారం అలా సెట్ అయ్యిందట. 
అంతా బాగానే వుంది. ఫస్ట్ పార్ట్‌లో ‘రాధికా.. ’ అంటూ హీరోయిన్ నేహా శెట్టి పేరు కూడా బాగానే పాపులర్ అయ్యింది. ఇక సీక్వెల్ కోసం ‘పెళ్లి సందడి’ బ్యూటీ శ్రీ లీలను తీసుకోవాలనుకుంటున్నారట. 
చాలా కాలంగా హీరోయిన్ శ్రీలీల పేరు ప్రచారంలో వుంది కానీ, కన్‌ఫామ్ చేయలేదు. ఇప్పుడు కూడా అధికారికంగా కన్‌ఫామ్ చేయలేదు. కానీ, దాదాపుగా శ్రీలీల పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. రేపో, ఎల్లుండో అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తారనీ అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com