ఇంటికి నిప్పంటించిన వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష
- August 21, 2022
బహ్రెయిన్: తాను నివసిస్తున్న అపార్ట్మెంట్ను ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టిన 30 ఏళ్ల వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష పడింది. హై క్రిమినల్ కోర్టులో జరిగిన విచారణలో వ్యక్తి నేరానికి పాల్పడినట్లు నిర్ధారించారు. అపార్ట్మెంట్కు నిప్పంటించినందుకు సదరు వ్యక్తిని కోర్టు దోషిగా తేల్చింది. తను ఉంటున్న అపార్టుమెంట్ ను తగులబెట్టి అదే భవనంలో నివసిస్తున్న ఇతరుల జీవితాలకు ప్రమాదం కలిగించాడని కోర్టు ఆక్షేపించింది. సంఘటన జరిగిన సమయంలో నిందితుడు డ్రగ్స్ మత్తులో ఉన్నాడని వైద్య పరీక్షలో తేలిందని, సిగరేట్ తాగుతూ ఉద్దేశపూర్వకంగానే అపార్ట్మెంట్కు నిప్పు పెట్టాడని తమ విచారణలో తేలిందని పోలీసులు కోర్టుకు తెలిపారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ అతనిపై ఉద్దేశపూర్వకంగా నిప్పుపెట్టడం, ఇతరుల ప్రాణాలకు హాని కలిగించినట్లు అభియోగాలు మోపింది.
తాజా వార్తలు
- హైదరాబాద్లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!







