దుబాయ్‌లో నకిలీ డాగ్ డీల్‌.. ముగ్గురికి జైలుశిక్ష, జరిమానా

- August 22, 2022 , by Maagulf
దుబాయ్‌లో నకిలీ డాగ్ డీల్‌.. ముగ్గురికి జైలుశిక్ష, జరిమానా

దుబాయ్: కుక్కను విక్రయిస్తానని ఓ ఆసియా వ్యక్తిని Dhs 4,000 మోసగించినందుకు దుబాయ్ కోర్ట్ ఆఫ్ మిస్డిమీనర్స్ ముగ్గురికి జైలుశిక్ష, జరిమానా విధించింది. ఒక్కొక్కరికి మూడు నెలల జైలు శిక్షతోపాటు సంయుక్తంగా Dhs 4,000 జరిమానా చెల్లించాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. ఈ కేసు గత జూన్ లో చోటుచేసుకుంది. వాట్సాప్ ద్వారా కుక్కను అమ్మకానికి పెట్టిన వ్యక్తి తనను మోసగించాడని ఒక ఆసియా వ్యక్తి ఫిర్యాదు చేశారు. విక్రేత కుక్క ఫోటోలు, వీడియో క్లిప్‌ను వాట్సాప్ లో పంపాడని వాది తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కుక్క కోసం విక్రేత Dhs 3,000 అడిగాడని, కానీ Dhs 2,500 అంగీకారం కుదిరిందన్నారు. అనంతరం విక్రేత బ్యాంక్ ఖాతా నంబర్‌ను అడిగిన మొత్తాన్ని ట్రాన్స్ ఫర్ చేసినట్లు తెలిపారు. షిప్పింగ్ ద్వారా అదే రోజు కుక్కను తన వద్దకు పంపుతానని చెప్పాడని, కానీ పంపలేదన్నారు. అమ్మకందారుడిని సంప్రదించగా అత్యవసర పరిస్థితుల కారణంగా కుక్కను పంపలేదన్నారు. ఆ తర్వాత కుక్కను డెలివరీ చేయడానికి షిప్పింగ్ కంపెనీకి రీఫండబుల్ ఇన్సూరెన్స్‌గా Dhs8,000 చెల్లించాలని డిమాండ్ చేసినట్లు పేర్కొన్నాడు. తన వద్ద అంత మొత్తం లేదని విక్రేతకు తెలియజేయగా.. మరొక బ్యాంక్ ఖాతాకు Dhs 1,500 బదిలీ చేయమని విక్రేత కోరినట్లు చెప్పారు. ఆ తర్వాత విక్రేత మొబైల్ పోన్ పనిచేయడం లేదని, దీంతో మోసపోయినట్లు గ్రహించినట్లు ఆసియా వ్యక్తి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com