బ్యాంకు ఖాతాల నుంచి నగదు మాయం.. 11 మంది నిందితులు అరెస్టు
- August 23, 2022
రియాద్: సౌదీ పౌరులు, నివాసితుల బ్యాంక్ ఖాతాల నుండి డబ్బును మాయం చేస్తోన్న ముఠాలోని 11 మంది సభ్యలను అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు సౌదీ అరేబియా పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. 11 మంది అనుమానితులు తమ అక్రమ కార్యకలాపాలను నిర్వహించేందుకు వీలుగా ఓ అద్దె ఇంటిని తీసుకున్నట్లు తమ విచారణలో తేలిందని అధికారులు పేర్కొన్నారు. నిందితులు తీవ్రమైన నేరాలకు పాల్పడినందున వారిని అరెస్టు చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది. ముఠా సభ్యులు బ్యాంకు ఉద్యోగుల నటిస్తూ.. బాధితలతో మాట్లడారని పోలీసులు తెలిపారు. బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయాయని, ఏటీఎం కార్డులు డీయాక్టివేట్ అయ్యాయని అనుమానితులు బాధితుల ఫోన్లకు సందేశాలు పంపేవారన్నారు. తిరిగి వాటిని యాక్టివేట్ చేసే పేరుతో ఖాతాదారుల రహస్య సమాచారాన్ని తెలుసుకొని వారి ఖాతాల్లోని మొత్తాలను కాజేసేవారని అధకారులు వివరించారు. బ్యాకింగ్ మోసాలపై ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రజలకు సూచించింది.
తాజా వార్తలు
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు









