మోసం, మనీలాండరింగ్ కేసు.. మహిళకు జైలు శిక్ష
- August 23, 2022
బహ్రెయిన్: స్కామింగ్, మనీలాండరింగ్ కు పాల్పడిన ఒక ఆసియా మహిళకు హై క్రిమినల్ కోర్ట్ నాలుగు సంవత్సరాల జైలు శిక్ష, 46,000 బిడిలు జరిమానా విధించింది. ఈ కేసులో నేరంలో పాల్గొన్నందుకు సాక్ష్యాలు లేకపోవడంతో ఒక ఆసియా వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించి విడుదల చేసింది. పోలీసు రికార్డుల ప్రకారం.. నకిలీ బ్యాంక్ కాల్స్, మోసపూరిత గేమ్స్ ద్వారా అనేక మంది బాధితులను విదేశాల్లో గుర్తుతెలియని వ్యక్తితో కలిసి బాధిత మహిళ మోసం చేసింది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ యాంటీ కరప్షన్ అండ్ ఎకనామిక్ & ఎలక్ట్రానిక్ సెక్యూరిటీకి బాధితుల నుండి అనేక ఫిర్యాదులు అందడంతో ఆమె వ్యవహరం వెలుగులోకి వచ్చింది. బాధితుల ఖాతాల నుంచి స్వాహా చేసిన డబ్బును ఆఫ్‌షోర్ ఖాతాలకు పంపకముందే ఆమె ఖాతాకు బదిలీ అయినట్లు అధికారులు గుర్తించారు. అనుమానాస్పద లావాదేవీలు జరపడం ద్వారా మహిళ తనకు వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని లాండరింగ్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. మహిళ వీసా కార్డును కూడా ఉపయోగించినట్లు పోలీసు అధికారులు గుర్తించారు. శిక్ష అనుభవించిన తర్వాత నిందితురాలిని దేశం నుంచి శాశ్వతంగా బహిష్కరించనున్నారు.
తాజా వార్తలు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత







