యూఏఈ: 73 దేశాల వారికి 'వీసా ఆన్ అరైవల్' సౌకర్యం..
- August 25, 2022
యూఏఈ:యూఏఈ వెళ్లే 73 దేశాల వారికి వీసా ఆన్ అరైవల్ సౌకర్యం ఉంది.అంటే.. ఈ 73 దేశాల పౌరులకు వారివారి దేశాల పాస్‌పోర్టులు ఉంటే చాలు..యూఏఈలో దిగగానే ఆ దేశ విజిట్ వీసా పొందవచ్చు.జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) సమాచారం ప్రకారం ఈ 73 దేశాల వారికి 30 రోజుల నుంచి 180 రోజుల కాలపరిమితితో ఈ వీసా ఆన్ అరైవల్ సౌకర్యం కల్పించడం జరుగుతుంది.అయితే, భారతీయ పౌరులకు ఈ వెసులుబాటు కేవలం 14 రోజులకే పరిమితం చేసింది. అలాగే మనోళ్లకు ఇతర షరతులను కూడా యూఏఈ అమలు చేస్తోంది.
30 రోజుల వీసా ఆన్ అరైవల్ సౌకర్యం అందుబాటులో ఉన్న దేశాలు..
20 దేశాల వారికి యూఏఈ 30 రోజుల వ్యవధితో వీసా ఆన్ అరైవల్ సౌకర్యం కల్పిస్తోంది.ఈ దేశాలకు చెందిన పౌరులు ముందుగా వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. యూఏఈలోని విమానాశ్రయాల్లో దిగిన తర్వాత అక్కడి ఇమ్మిగ్రేషన్ విభాగంలో కావాల్సిన వివరాలు ఇస్తే.. వెంటనే విజిట్ వీసా ఇచ్చేస్తారు. అది కూడా పూర్తి ఉచితంగా. ఈ సౌకర్యం అందుబాటులో ఉన్న దేశాల జాబితా..
1.అన్డోరా, 2.ఆస్ట్రేలియా,3.బ్రూనై,4.కెనడా,5.చైనా,6.హాంగ్ కాంగ్,7.జపాన్, 8. కజాఖ్స్తాన్ 9. మకావ్,10.మలేషియా,11.మారిషస్,12. మొనాకో,13.న్యూ జీలాండ్,14. రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ ,15.సన్ మారినో,16.సింగపూర్,17.యుక్రెయిన్,18.యునైటెడ్ కింగ్డమ్ & నార్తర్న్ ఐర్లాండ్, 19.యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా,20.వాటికన్ సిటీ
90 రోజుల వీసా ఆన్ అరైవల్ సౌకర్యం ఉన్న దేశాలు...
90 రోజుల వీసా ఆన్ అరైవల్ సౌకర్యం ఉన్న దేశాల సంఖ్య 53. ఈ దేశాలకు చెందిన వారికి యూఏఈ ప్రభుత్వం మల్టీపుల్ ఎంట్రీతో పాటు 90 రోజుల కాలపరిమితితో విజిట్ వీసా ఇస్తోంది. ఆ దేశాల జాబితా ఇదే..1. ఆర్జెంటినా ,2. ఆస్ట్రియా,3. బహమాస్ ఐలాండ్స్, 4. బార్బొడాస్, 5. బెల్జియం, 6. బ్రెజిల్, 7. బల్గేరియా, 8. చిలి 9. కొలంబియా,10. కోస్తా రికా,11. క్రొతియా, 12. సైప్రస్, 13. చెక్ రిపబ్లిక్, 14. డెన్మార్క్, 15. ఎల్ సాల్వడార్, 16. ఎస్టోనియా, 17. ఫిన్లాండ్, 18. ఫ్రాన్స్, 19. జర్మనీ, 20. గ్రీస్, 21. హోండురస్, 22. హన్గేరి, 23. ఐస్లాండ్, 24. ఇటలీ, 25. కిరిబాటి, 26. లాట్వియా, 27. లైచ్టెన్స్టెయిన్, 28. లిథుయేనియా, 29. లక్సెంబోర్గ్, 30. మాల్దీవ్స్, 31. మాల్టా, 32. మోంటెనెగ్రో, 33. నౌరు, 34. నెథర్లాండ్స్, 35. నార్వే, 36. ప్రగాయ్ 37. పేరు, 38. పోలాండ్, 39. పోర్చుగల్, 40. రోమానియా, 41. రష్యన్ ఫెడరేషన్ 42. సెయింట్ విన్సన్ట్ అండ్ ది గ్రేనాడైన్స్ 43. సన్ మారినో, 44. సెర్బియా, 45. సీషెల్స్, 46. స్లోవేకియా, 47. స్లోవేనియా, 48. సోలమన్ ఐలాండ్స్, 49. సౌత్ కొరియా, 50. స్పెయిన్, 51. స్వీడన్, 52. స్విట్జర్లాండ్ ,53. ఉరిగాయ్.
ఇక 180 రోజుల విజిట్ వీసా సౌకర్యం కేవలం మెక్సికన్ పాస్‌పోర్టు ఉన్నవారికి మాత్రమే ఉంది. ఆరు నెలల వ్యవధితో వచ్చే విజిట్ వీసాతో యూఏఈలో 180 రోజుల వరకు స్టే చేసే వెసులుబాటు ఉంటుంది.వీసా జారీ అయిన తేదీ నుంచి దీని గడువు మొదలవుతుందని ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలిపారు.ఇక భారతీయులకు 14 రోజుల వీసా ఆన్ అరైవల్ సౌకర్యం ఉంది. దీనికి భారత పాస్‌పోర్టు ఉంటే సరిపోతుంది.మన పాస్పోర్టుతో పాటు అమెరికా విజిట్ వీసా లేదా యూఎస్ గ్రీన్‌కార్డు ఉన్నవారికి కూడా ఇది వర్తిస్తుంది. అలాగే యూకే రెసిడెన్సీ వీసా లేదా యూరోపియన్ యూనియన్ (EU) రెసిడెన్సీ వీసా ఉన్న భారతీయులకు ఈ వెసులుబాటు ఉంది.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్‌తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్‌లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







