రౌడీకి థాంక్స్ చెప్పిన షాలినీ పాండే.! ఎందుకో తెలుసా.?
- August 25, 2022
షాలినీ పాండే.. ఈ పేరు గుర్తుంది కదా.. ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ముద్దుగుమ్మ పేరే షాలినీ పాండే. ఈ ముద్దుగుమ్మ తాజాగా విజయ్ దేవరకొండకు థాంక్స్ చెబుతూ సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది.
ఆగస్టు 25 నా జీవితంలో చాలా ముఖ్యమైంది.. అంటూ షాలినీ పాండే పేర్కొంది. ఎందుకంటారా.? ఇదే రోజు అనగా ఆగస్టు 25న 2017లో ‘అర్జున్ రెడ్డి’ సినిమా రిలీజైంది. విజయ్ దేవరకొండతో షాలినీ పాండే జత కట్టిన తొలి చిత్రమిది.
ఈ సినిమా ఏ స్థాయిలో విజయం అందుకుందో, ఎంత సెన్సేషనల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన తొలి సినిమాకి అంత గొప్ప ఆదరణ దక్కినందుకు కారణం విజయ్ దేవరకొండ అనీ, ఆయనకు తాను ఎప్పుడూ రుణపడి వుంటాననీ, తొలి సినిమా అనే భయం తనలో లేకుండా, సెట్‌లో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయిన విజయ్‌కి స్పెషల్‌గా థాంక్స్.. లవ్ యూ అంటూ షాలినీ పాండే పోస్ట్ చేసింది.
అలాగే, ఈ రోజు రిలీజ్ అవుతున్న విజయ్ తాజా చిత్రం ‘లైగర్’ మంచి విజయం అందుకోవాలని షాలినీ పాండే కోరుకుంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ‘అర్జున్ రెడ్డి’ కేవలం 5 కోట్ల బడ్జెట్‌తో రూపొంది బాక్సాఫీస్ వద్ద ఏకంగా 50 కోట్లు వసూళ్లు రాబట్టిందన ట్రేడ్ వర్గాల అంచనా. అన్నింటికీ మించి ‘అర్జున్ రెడ్డి’గా విజయ్ క్రియేట్ చేసిన పాత్ర తాలూకు ఇంపాక్ట్ నెవ్వర్ బిపోర్, ఎవ్వర్ ఆఫ్టర్.!
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్టు రెన్యువల్‌కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!
- యూఏఈ క్షిపణులు, డ్రోన్ల ముప్పును సమర్థంగా ఎదుర్కొంది
- అలులాలో ఏటా 1.30 లక్షల టన్నుల ఖర్జూరాల ఉత్పత్తి..!!
- కువైట్‌లో జూలై 16 నుంచి పెరగనున్న ఎండల తీవ్రత..!!
- యూఏఈ లాటరీ.. Dh50,000 చొప్పున బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!
- దోహా ఇండస్ట్రియల్ ఏరియాలో గోదాంలో అగ్నిప్రమాదం..!!
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్







