భారత్ నుంచి యూఏఈకి అక్టోబర్‌లో రెట్టింపు కానున్న విమాన టికెట్ల ధరలు..
- August 26, 2022
యూఏఈ: అక్టోబర్ నెలలో యూఏఈ వెళ్లే ఆలోచనలో ఉంటే ముందే టికెట్ బుక్ చేసుకోవడం మేలు. లేకుంటే ఆ నెలలో భారత్ నుంచి యూఏఈ వెళ్లేవారికి విమాన టికెట్ల ధరలు చుక్కలు చూపించడం ఖాయం.ఈ విషయం స్వయంగా ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి. వచ్చే అక్టోబర్‌ను బంపర్ మంత్‌గా పేర్కొంటున్నాయి. అయితే, అక్టోబర్‌లో విమాన టికెట్ల ధరలు ఎందుకు పెరుగుతాయని అడిగితే.. ఆ ఒకే నెలలో దసరా, దీపావళి పండుగలు రావడమేనని ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నమాట. అక్టోబర్ 5న దసరా ఉంటే.. అక్టోబర్ 24 దీపావళి ఉంది.
ఇలా 15 రోజుల వ్యవధిలో అది ఒకే నెలలో రెండు పెద్ద పండుగలు రావడం విమాన టికెట్లకు రెక్కలు రావడానికి కారణం అంటున్నాయి.ఆ సమయంలో భారత్ నుంచి దుబాయ్ వెళ్లే వారి సంఖ్య అధికంగా ఉంటుందట.దీంతో అక్టోబర్ నెలకు సంబంధించి బస కోసం హోటల్ రూమ్స్ బుకింగ్స్‌కు కూడా ఇప్పటి నుంచే మొదలైనట్లు ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు. ఇప్పటికే బుర్ దుబాయ్‌లో పండుగ రోజుల్లో 100శాతం బుకింగ్స్ పూర్తి అయ్యాయని హోటల్ యజమానులు చెబుతున్నారట.
ప్లూటో ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ అవినాష్ అద్నానీ మాట్లాడుతూ.. అక్టోబర్ నెలలో విమాన టికెట్ల ధరలు రెట్టింపు కావడం ఖాయం.ఒకే నెలలో దసరా, దీపావళి వస్తుండడంతో ఈసారి భారత్ నుంచి యూఏఈకి ప్రయాణాలు భారీగా పెరగనున్నాయి.ఇప్పటికే బుర్ దుబాయ్‌లోని హోటళ్లలో అక్టోబర్ నెలకు సంబంధించి బుకింగ్స్ 100శాతం పూర్తైనట్లు యాజమాన్యాలు చెబుతున్నాయి.అందుకే అక్టోబర్ బంపర్ మంత్ కాబోతుందని అవినాష్ చెప్పుకొచ్చారు. ఒకవేళ అక్టోబర్‌లో దుబాయ్‌ను సందర్శించే ఆలోచనలో ఉంటే మాత్రం ఇప్పుడే విమాన టికెట్స్, బస కోసం హోటల్ రూమ్స్ బుక్ చేసుకోవాలని ఆయన సూచించారు.ముంబై , ఢిల్లీ నుంచి యూఏఈకి సెప్టెంబర్ 10 నుంచి 15 తేదీ వరకు విమాన టికెట్ల ధరలు సగటున వెయ్యి దిర్హాములు నుంచి 1200 దిర్హాములుగా ఉంటే.. అదే అక్టోబర్‌లో ఈ ధరలు 2వేల దిర్హాములు వరకు పలికే అవకాశం ఉందన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







