ఏంటీ ‘ఆంటీ’ గోల.! అనసూయ పండగ చేసుకుంటోందిగా.!
- August 27, 2022
అనసూయ భరద్వాజ్‌కి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపైనా, పెద్ద తెరపైనా అనసూయ హవా అంతా ఇంతా కాదు. ఇక సోషల్ మీడియాలో అనసూయకున్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.
తిట్టేవాళ్లూ వున్నారు. అమితంగా అభిమానించేసేవాళ్లూ వున్నారు. ఏ ఇష్యూ పైన అయినా కుండ బద్దలు కొట్టేసినట్లు మాట్లాడే అనసూయ, తాజాగా ఓ వివాదంలో చిక్కుకుంది. ఆ వివాదాన్ని అనసూయ ఎంజాయ్ చేస్తోందనుకోండి.
ఇంతకీ అసలు విషయమేంటంటే, ‘లైగర్’ సినిమాకి సంబంధించి ‘కర్మ’ సిద్ధాంతం అంటూ కొన్ని స్టేట్‌మెంట్లు ఇస్తూ అనసూయ సోషల్ మీడియాలో స్పందించిన సంగతి తెలిసిందే. ఆ స్టేట్‌మెంట్‌ని ఆసరాగా తీసుకుని అనసూయతో ఆటాడేసుకుంటున్నారు నెటిజన్లు.
ఈ క్రమంలోనే ‘ఆంటీ’ అనే హ్యాష్ ట్యాగ్ ఒకటి ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చారు. ఆంటీ అని పిలిస్తే అస్సలు నచ్చదు అనసూయకి. దాంతో దానికి కౌంటర్‌గా ‘ఆన్‌లైన్ దుర్వినియోగానికి తెర లేపండి’ అనే హ్యాష్ ట్యాగ్‌తో అనసూయ రివర్స్ కౌంటర్ ఎటాక్ స్టార్ట్ చేసింది.
ఇలా సోషల్ మీడియా అటెన్షన్‌ని క్యాష్ చేసుకునేందుకు అనసూయ బాగా కష్టపడింది. ఫలితం ఏంటనేది ఆమెకే తెలియాలనుకోండి. మొత్తానికి ట్రెండింగ్‌లోకి వచ్చిన ‘ఆంటీ’ హ్యాష్ ట్యాగ్‌తో మాత్రం ఓ వైపు అనసూయ, మరోవైపు నెటిజనం భలే పండగ చేసుకుంటున్నారులే.!
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







