‘బ్రహ్మాస్త్ర’కు ‘బింబిసార’ సెంటిమెంట్: వర్కవుట్ అవుతుందా.?

- August 27, 2022 , by Maagulf
‘బ్రహ్మాస్త్ర’కు ‘బింబిసార’ సెంటిమెంట్: వర్కవుట్ అవుతుందా.?

భారీ ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ‘బ్రహ్మాస్ర్ర’ సినిమా త్వరలోనే (సెప్టెంబర్ 9) రిలీజ్‌కి సిద్ధంగా వుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్లు హుషారు చేసింది. ఇప్పటికే అలియా భట్ ప్రమోషన్లలో జోరుగా పాల్గొంటోంది.
హిందీతో పాటూ, తెలుగు తదితర భాషల్లో ఈ సినిమా రిలీజవుతోన్న సంగతి తెలిసిందే. సౌత్ నుంచి నాగార్జున తదితర నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. 
కాగా, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ సెప్టెంబర్ 2న హైద్రాబాద్‌లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది చిత్ర యూనిట్. రామోజీ ఫిలిం సిటీ ఈ వేడుకకు వేదిక కానుంది. 
ఈ ఈవెంట్‌కి జూనియన్ ఎన్టీయార్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నాడు. ‘బింబిసార’ సినిమా ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా ఎన్టీయార్ వెళ్లాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అలాగే ‘బ్రహ్మాస్ర్త’ కూడా ఆ సెంటిమెంట్‌తో హిట్ అవుతుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. 
‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో అలియా భట్ సీత పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. రాముడి జాడ కనిపెట్టి, సీతమ్మకు అప్పగించిన ఆంజనేయుడి ఫీలింగ్ క్రియేట్ చేశారు ఈ సినిమాలో అలియా, ఎన్టీయార్‌లు. వీరిద్దరి మధ్యా సాగిన సన్నివేశాలు సినిమాకి ఎంత హైలైట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
చూడాలి మరి, ఎన్టీయార్ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యి, ‘బ్రహ్మాస్ర్త’ హిట్ అయితే, బాలీవుడ్ కాస్త ఊపిరి పీల్చుకుంటుంది. టాలీవుడ్‌కి మరో ప్యాన్ ఇండియా హిట్ దక్కుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com