రవితేజ న్యూ అప్‌డేట్: అతీంద్రియ శక్తులతో మాస్ రాజా పోరాటం.!
- August 27, 2022
మాస్ సినిమాలకు పెట్టింది పేరుగా నిలిచిన మాస్ రాజా రవితేజ ఇటీవల వరుస ఫాఫులతో సఫర్ అవుతున్న సంగతి తెలిసిందే. లేటెస్టుగా మాస్ రాజా నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
అయినా ఆయన జోరు తగ్గలేదు. ఇప్పటికే చేతిలో రెండు ప్రాజెక్టులున్నాయ్. అవే ‘టైగర్ నాగేశ్వరరావు’, ‘అసురన్’ ప్రాజెక్టులు. వీటితో పాటూ, నిఖిల్ డైరెక్టర్‌తో రవితేజ మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడనీ తాజా సమాచారం.
నిఖిల్‌తో ‘సూర్య వెర్సస్ సూర్య’ సినిమా తెరకెక్కించిన కార్తిక్ ఘట్టమనేని రవితేజకి ఓ కథ చెప్పాడట. సూపర్ నేచురల్ పవర్స్ కాన్సెప్ట్‌లో రూపొందుతోన్న ఈ సినిమా కథ రవితేజకి తెగ నచ్చేసిందట.
దాంతో త్వరలోనే సినిమా పట్టాలెక్కించేద్దాం.. అని కార్తీక్‌కి హామీ ఇచ్చాడట రవితేజ. ‘సూర్య వెర్సస్ సూర్య’ సినిమాలో వెలుగు అంటే పడని హీరో కథని ఎంతో అందంగా అద్భుతంగా తెరకెక్కించి నిఖిల్‌కి కెరీర్‌లో మంచి హిట్ ఇచ్చాడు. ఈ సినిమాతోనే నిఖిల్ కెరీర్ టర్న్ అయ్యింది కూడా.
ఇప్పుడు మాస్ రాజాకి కూడా కార్తీక్ హిట్టు కట్టబెడతాడేమో చూడాలి మరి. అన్నట్లు కార్తీక్ ఘట్టమనేని ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌గా పలు సూపర్ హిట్ సినిమాలకు వర్క్ చేశారు. రీసెంట్ సూపర్ హిట్ ‘కార్తికేయ 2’ కి కార్తీక్ సినిమాటోగ్రాఫర్ కమ్ ఎడిటర్‌గా వర్క్ చేశాడు.
తాజా వార్తలు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..







