కొత్త వినోద గమ్యస్థానంగా షేక్ జాబర్ వంతెన..!
- August 29, 2022
కువైట్: కుటుంబాలు, పౌరులు, నివాసితులకు కొత్త వినోద వాతావరణాన్ని సృష్టించే లక్ష్యంతో షేక్ జాబర్ వంతెనపై తాత్కాలిక కార్యకలాపాలను ఏర్పాటు చేయాలని క్యాబినెట్ ఆలోచనగా ఉంది. అక్టోబరు నుండి మే వరకు వచ్చే శీతాకాలం, వసంత కాలంలో జాబర్ వంతెనపై రెండు కృత్రిమ ద్వీపాల నుండి ప్రయోజనం పొందాలని మంత్రివర్గ కమిటీ లక్ష్యంగా పెట్టుకుంది. చిన్న ప్రాజెక్టులు, మొబైల్ వాహనాలను కలిగి ఉన్న కువైట్ యువతకు ప్రయోజనం చేకూర్చేందుకు ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు. ముఖ్యంగా పిల్లలకు పండుగలు, క్రీడా కార్యకలాపాలు, కువైట్ ఉత్పత్తుల మార్కెట్లు, మారథాన్లు.. అందుబాటులో ఉన్న ఇతర కార్యకలాపాలను నిర్వహించే ప్రతిపాదనలను కూడా కమిటీ పరిగణనలోకి తీసుకోనున్నది. అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలతో మున్సిపాలిటీ ఈ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్‌ను సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







