కనిపించని శత్రువుతో సుధీర్ బాబు ‘వేట’.!
- August 29, 2022
విలక్షణ చిత్రాల్లో నటించేందుకు సుధీర్ బాబు ఎప్పుడూ ముందుంటాడు. కథా బలం వున్న చిత్రాలనే సుధీర్ బాబు ఎంచుకుంటూ వుంటాడు.
ఈ క్రమంలోనే ఓ సస్పెన్స్ థ్రిల్లర్‌లో సుధీర్ బాబు నటిస్తున్నాడు. ఈ సినిమాలో యాక్షన్ ఘట్టాలు చాలా ప్రత్యేకంగా వుండబోతున్నాయట. ‘హంట్’ అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి ‘గన్స్ డోంట్ లై’ అనే ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ పెట్టారు. ఈ క్యాప్షన్ ఎందుకు పెట్టాల్సివచ్చిందనేది సినిమా చూస్తే అర్ధమవుతుందంటున్నారు చిత్ర యూనిట్.
సీనియర్ హీరో శ్రీకాంత్, తమిళ నటుడు భరత్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కనిపించని శత్రువుతో కీలకంగా జరిపే ముగ్గురు పోలీసుల వేట ఈ సినిమా కథాంశమట. ఆధ్యంతం సినిమాని ఉత్కంఠగా తెరకెక్కించబోతున్నారట. మహేష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
సుధీర్ బాబు పాత్ర సినిమాకి మెయిన్ అస్సెట్ అవుతుందని అంటున్నారు. మిగిలిన వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయ్. మరోవైపు సుధీర్ బాబు నటించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెబుతా’ చిత్రం రిలీజ్‌కి సిద్ధమైన సంగతి తెలిసిందే. కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్‌లో రిలీజ్ కానుంది.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







