ప్రభాస్ - మారుతి ప్రాజెక్ట్ వెనుక రాజమౌళి వున్నాడా.?

- August 29, 2022 , by Maagulf
ప్రభాస్ - మారుతి ప్రాజెక్ట్ వెనుక రాజమౌళి వున్నాడా.?

ప్యాన్ ఇండియా స్టార్‌గా పాపులర్ అయిన ప్రభాస్, ‘బాహుబలి’ తర్వాత ఆ స్థాయి డైరెక్టర్లతోనే వర్క్ చేస్తూ వస్తున్నాడు. అలా కాకపోయినా, ఆయన నటించిన సినిమాల స్థాయి మాత్రం భారీ రేంజ్‌లోనే వుంటూ వస్తోంది. అయితే, ప్రభాస్, మారుతితో ఓ ప్రాజెక్టు ఇటీవలే ఓకే చేసిన సంగతి తెలిసిందే.

త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కించేయనున్నాడట ప్రభాస్. వీలైనంత త్వరగా ఈ సినిమాని పూర్తి చేసేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారట. గమనించాల్సిన విషయమేంటంటే, ఈ సినిమాని లో బడ్జెట్‌లో హై క్వాలిటీతో తెరకెక్కించాలన్నదే ప్రభాస్ అండ్ టీమ్ అభిప్రాయమట.

ఆ క్రమంలోనే హైద్రాబాద్ రామోజీ ఫిలిం సిటీలోనే ఈ సినిమా మొత్తం షూటింగ్ రెండు షెడ్యూల్స్‌లో పూర్తి చేయాలని అనుకుంటున్నారట. అయితే, మారుతితో సినిమా అంటే, ప్రభాస్ ఫ్యాన్స్ గగ్గోలు పెట్టిన సంగతి తెలిసిందే. కానీ, ప్రభాస్ ని మారుతితో సినిమా చేసేందుకు ప్రేరేపించిందని స్వయంగా జక్కన్నే అని ఇండస్ర్టీలో గుస గుసలాడుకుంటున్నారు.

అందుకూ ఓ కారణం లేకపోలేదట. ప్రభాస్ చేసిన భారీ సినిమాలన్నీ ఫెయిల్ అవుతూ వస్తున్నాయ్. దాంతో, చీకట్లో రాయేసినట్లు, మారుతిలాంటి ఓ మినిమమ్ గ్యారంటీ దర్శకుడితో ఓ సినిమా కానిచ్చేస్తే బాగుంటుందని రాజమౌళి, ప్రభాస్ కి సలహా ఇచ్చాడట. జక్కన్న అంతటోడే సజెస్ట్ చేయడంతో ప్రభాస్ కాదనలేకపోయాడట. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుందనీ సమాచారం. మాళవిక మోహనన్ ఈ సినిమాలో ప్రభాస్ తో జోడీ కడుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com