వేసవి ముగిసినా.. తగ్గని ఇండియా-యూఏఈ విమాన ఛార్జీలు
- September 01, 2022
యూఏఈ: విద్యా సంస్థలకు వేసవి సెలవులు ముగిసినప్పటికీ, ప్రముఖ భారతీయ గమ్యస్థానాల నుండి ఎమిరేట్స్‌కు విమాన ఛార్జీలు ఆకాశాన్నంటుతున్నాయని ప్రవాసులు, ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు. కోవిడ్-19 పరిమితులు ముగిసినందున విమానయాన సంస్థలు కూడా తమ సామర్థ్యాన్ని పెంచుకున్నాయని ఏవియేషన్ కన్సల్టెన్సీ OAG ఇటీవలి నివేదిక పేర్కొంది. దీంతోపాటు ఎమిరేట్ ప్రస్తుతం ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇస్తున్నందున దక్షిణాసియా గమ్యస్థానాల నుండి దుబాయ్‌కి టిక్కెట్ ధరలు ఎక్కువగా ఉన్నాయని ఏజెంట్లు తెలిపారు. పాకిస్తాన్‌లోని కరాచీ వంటి గమ్యస్థానాల నుండి వన్-వే విమాన ఛార్జీలు ఫ్లైదుబాయ్‌లో సగటు Dh960, దుబాయ్ ఫ్లాగ్ క్యారియర్ ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌లో Dh1,185 వరకు ఉన్నాయి. ఇదే సమయంలో కేరళ నుండి వచ్చేందుకు ధరలు సామాన్యులకు భరించలేనివిగా ఉన్నాయని ఏవియేషన్ నిపుణుడు, స్మార్ట్ ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ అఫీ అహ్మద్ తెలిపారు. కేరళలో ఓనమ్‌ను సెప్టెంబర్ 8న జరుపుకోనున్నారని, దీంతో సెప్టెంబర్ 10 తర్వాత మాత్రమే ధరలు తగ్గుముఖం పడతాయని భావిస్తున్నట్లు అహ్మద్ చెప్పారు. ట్రావెల్ అగ్రిగేటర్ SkyScanner.ae ప్రకారం.. సెప్టెంబర్ 1న దక్షిణ, ఉత్తర భారత గమ్యస్థానాల నుండి చౌకైన వన్-వే ఛార్జీలు ఇలా ఉన్నాయి. కొచ్చి - Dh1,503, కన్నూర్ - Dh1,701, కోజికోడ్ - Dh1,335, బెంగళూరు - Dh1,277, చెన్నై - Dh1,881, ముంబై - Dh1,146, ఢిల్లీ - Dh1,203. కాగా, సెప్టెంబరు 9 తర్వాత ఉత్తర, పశ్చిమ భారత గమ్యస్థానాల నుండి విమాన ఛార్జీలు తగ్గే అవకాశం ఉందని ఏజెంట్లు చెబుతున్నారు. దక్షిణ భారత సెక్టార్ల నుండి UAEకి విమాన ఛార్జీలు సెప్టెంబర్ చివరి వరకు సగటు Dh700 వద్ద కొనసాగుతాయన్నారు. భారతదేశం నుండి ఆఫ్-పీక్ టిక్కెట్ల ధర సాధారణంగా Dh200 నుండి Dh300 వరకు ఉంటుందని చెప్పారు. ఇదిలా ఉండగా.. గత వారం గల్ఫ్ దేశాలు, ఇండియా మధ్య నడిచే విమానాలలో విమాన టిక్కెట్ల అధిక ధరలను సవాలు చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్‌ను విచారించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కు ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఢిల్లీకి చెందిన కేరళ ప్రవాసీ అసోసియేషన్ ఈ పిటిషన్ దాఖలు చేసింది. ఎయిర్‌క్రాఫ్ట్ రూల్స్, 1937లోని రూల్ 135(1)ని విమానయాన సంస్థలు ఉల్లంఘించాయని, ఏకపక్షంగా.. రాజ్యాంగ విరుద్ధంగా టిక్కెట్ల ధరలను అవి పెంచాయని పిటిషన్ దాఖలు చేశాయి.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







